India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 15న రాజాం వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు పురపాలక సంఘం పరిధిలోని అంబేడ్కర్ కూడలి వద్ద బహిరంగ సభ ఉంటుందని రాజాం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ బుధవారం రాత్రి తెలిపారు. సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా అధికంగా హాజరవుతారని చెప్పారు.
ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి అవసరం లేదని, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి ఆయా రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారం నిర్దేశిత వేళల్లో ఎప్పుడైనా చేపట్టవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా ఎన్నికలు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలాని సమూన్ అన్నారు. బుధవారం ఎచ్చెర్ల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తెలిపారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాప్స్, కళ్ళద్దాలు, వాటర్ బాటిల్స్‌లను ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జీ.ఆర్ రాధిక చేతుల మీదగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడే వస్తు సామగ్రి ఓ ప్రైవేటు సంస్థ ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు.
నందిగాం మండలంలో 20 సచివాలయాలకు సుమారు 16 సచివాలయాల పరిధిలోని 360 మంది వాలంటీర్లు బుధవారం ఉదయం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలతో మానసిక వేదనకు గురై రాజీనామా చేశామని వారు తెలిపారు. కార్యక్రమంలో వీరితో పాటుగా నియోజకవర్గ వైసీపీ నాయకులు ఉన్నారు.
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ హెచ్చరించారు. బుధవారం మండలంలోని తహాశీల్దార్ కార్యాలయంతో పాటుగా గొబ్బూరు గ్రామ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరిగే విధంగా ఓటర్లను చైతన్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలన్నారు.
టెక్కలి నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ కూటమి అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. 2024లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా 46,743.63 ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. అందులో ఒక్క పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోనే సుమారు 24,753 ఎకరాల్లో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 15 వేల టన్నుల జీడి పిక్కలు దిగుబడి వస్తుండగా, సుమారు 13వేల మందికి ఈ పంట ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కొన్ని తెగుళ్ల వల్ల పంటకు భారీ నష్టం వాటిల్లింది.
టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిల్లి కృపారాణి పోటీచేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం మరో 12 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం రాత్రి విడుదల చేయగా.. కృపారాణి పేరు అందులో ఖరారైంది. వైసీపీని వీడిన ఆమె ఇటీవలే వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం తెలిసిందే.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంతో పాటు నరసన్నపేట, పలాస, ఇతర ప్రాంతాల్లో బంగారం దుకాణాలు కళకళలాడాయి. పసిడి ధరలు పరుగులు పెడుతున్నా ఏమాత్రం వెనుకాడకుండా బంగారం, ఆభరణాలు, వెండి వస్తువులు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపారు. తెలుగు వారు చేసుకునే తొలి పండుగ ఉగాది. ఉగాది రోజున కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే ఏడాది పొడవునా అదే తరహాలో కొనుగోలు చేస్తుంటారని ఒక నమ్మకం.
Sorry, no posts matched your criteria.