Srikakulam

News May 8, 2024

SKLM: 46 మంది హోంగార్డులకు దక్కని ఓటు హక్కు

image

పాలకొండ సబ్ డివిజన్లో పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ 46 మంది హోంగార్డులకు ఓటు హక్కు కల్పించడం లేదని వాపోయారు. మూడు రోజుల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ ఓటుపై ఎన్నికల అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు చొరవ తీసుకొని తమకు ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

News May 8, 2024

UPSCలో శ్రీకాకుళం జిల్లా యువకుడి సత్తా

image

UPSC ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో సింగూరు కృష్ణ చైతన్య ఆల్ ఇండియా 83వ ర్యాంక్ సాధించారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం EPFO డిపార్ట్మెంట్‌లో అకౌంట్స్ ఆఫీసర్‌గా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య సొంత ఊరు సరుబుజ్జిలి మండలం కూనజమ్మన్నపేట. ఇతని తండ్రి సింగూరు రంగనాయకులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి మీనాకుమారి గృహిణి. స్థానిక గ్రామస్థులు కృష్ణ చైతన్యకు అభినందనలు తెలిపారు.

News May 8, 2024

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన శ్రీకాకుళం ఎస్పీ

image

ఎచ్చర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి భద్రపరుస్తున్న స్ట్రాంగ్ రూములను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక బుధవారం పరిశీలించారు. ఈవీఎంలు ఇతర సామగ్రి తీసుకువచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా.. చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News May 8, 2024

శ్రీకాకుళం: ఈవీఎంల తరలింపునకు పటిష్ఠ చర్యలు

image

ఎన్నికల అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకువచ్చే వాహనాలకు ఏటువంటి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, పోలీసు అధికారులుకు దిశానిర్దేశం చేశారు. బుధవారం జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక, ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాల వద్ద పోలింగ్ అనంతరం ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించారు.

News May 8, 2024

హిరమండలం: వంశధార నదికి స్నానానికి వెళ్లి బాలిక మృతి

image

హిరమండలం మండలం పాత హీరమండలం గ్రామానికి చెందిన కుమ్మరి బాలా మాధురి (15) బుధవారం ఉదయం వంశధార నదికి తన స్నేహితులతో స్నానానికి వెళ్లింది. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం తన స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి కుమార్తె విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలిక మరణంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. 

News May 8, 2024

ఎచ్చెర్ల: పిడుగుపాటుకు ఆవులు మృతి

image

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి గ్రామంలో పశువుల పాకపై సోమవారం అర్ధరాత్రి పిడుగు పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అలుపున సీతయ్యకు చెందిన మూడు పాడి ఆవులు మృతి చెందాయి. పాలు అమ్మకం ద్వారా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబానికి ఒక్కసారి రూ.2 లక్షలు వరకు నష్టం వాటిల్లడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News May 8, 2024

నైర వ్యవసాయ కళాశాలలో వరి విత్తనాల విక్రయం

image

వ్యవసాయ కళాశాల నైర ఫారంలో ఖరీఫ్ 2024కు గాను నేటి నుంచి వరి విత్తనాలు విక్రయిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ ఎం. భరతలక్ష్మి తెలిపారు. స్వర్ణ (ఎంటీయూ 7029), సాంబ మసూరి (బీపీటీ 5204) మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), శ్రీధృతి (ఎంటీయూ 1121), శ్రీకాకుళం సన్నాలు (ఆర్ జీ ఎల్ 2537) మొదలగు రకాలు విక్రయాలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

News May 8, 2024

శ్రీకాకుళం: రోడ్డు దాటుతుండగా వృద్ధురాలి మృతి

image

రోడ్డు దాటుతుండగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన మంగళవారం విజయవాడలో జరిగింది. శ్రీకాకుళం నగరానికి చెందిన ఎ.సావిత్రమ్మ (62) కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లారు. అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చారు. కెనాల్ రోడ్డులో వెళ్తుండగా వ్యాన్ ఢీకొనడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు దొరబాబు ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 8, 2024

శ్రీకాకుళంలోనే అత్యధిక సర్వీస్ ఓట్లు

image

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు. నేవీ, ఆర్మీ ఎయిర్‌పోర్స్‌తో పాటు సాయుధ దళాలో ఈ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపికై సేవాలందిస్తుంటారు. పలాసలో 3,030, టెక్కలి 2,919, ఆమదాలవలస 2,240 నరసన్నపేటలో 2,228 మంది ఓటర్లు నమోదు చేస్తుకున్నారు.

News May 8, 2024

SKLM: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు సీట్ల కేటాయింపు

image

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు పరీక్ష రాసిన విద్యార్థులు సాధించిన మార్కుల బట్టి సీట్లను కేటాయించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లాలో 800 సీట్లకు గాను 720 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. వారి ఫోన్‌లకు సందేశాలను పంపించామని స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీలోగా విద్యార్థులు ఆయా గురుకులాల్లో వివరాలు తెలపాలన్నారు.