India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎచ్చెర్ల నియోజకవర్గం జి. సిగడాం మండలం మెట్టవలసలో డయేరియా బారిన పడి గొర్లె చిన్న అప్పాలనాయుడు (70) వృద్ధుడు మృతి చెందాడు. ఈ నెల 4న విరోచనాలు, వాంతులు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలో బాధితుల సంఖ్య 73కు చేరింది. 34 మంది శ్రీకాకుళం, రాజం, పొందూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 28 మంది గ్రామంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ ప్రభుత్వ DLTC ఐటీఐ కళాశాలలో ఈ నెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో రెండు ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటాయని ఆయన పేర్కొన్నారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, అర్హతతో (18- 40 ) సంవత్సరాల మధ్య వయస్సుగల వారు అర్హులన్నారు. సంబంధిత ధ్రువపత్రాలు ఒరిజినల్, జిరాక్స్‌లు తీసుకుని శుక్రవారం ఉదయం హాజరుకావాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ శాఖల సమన్వయంతో విద్యా శాఖాధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ప్రతీ పాఠశాలలో ఉదయం గురువారం ఉదయం 7.గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగిస్తారు. అనంతరం 3 గంటలకు నూతన కమిటీలతో తొలి సమావేశం నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

నందిగం మండలం దొడ్ల రామచంద్రాపురం గ్రామానికి చెందిన కర్రి హేమలతను వరకట్నం కోసం వేధించిన కేసులో ఆమె భర్త నర్తు హేమరాజు, అత్త కనకమ్మ, గోపాలరావు, సరోజినీలకు జైలుశిక్ష జరిమానా విధిస్తూ బుధవారం టెక్కలి జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌హెచ్‌ఆర్ తేజాచక్రవర్తి తీర్పును వెల్లడించారు. 2018లో నందిగంలో నమోదు అయిన వరకట్నం వేధింపుల కేసు రుజువు కావడంతో భర్తకు 11 నెలలు, మిగతా ముగ్గురికి మూడు నెలలు జైలు శిక్ష విధించారు.

రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ- పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ సమావేశానికి వ్యవసాయ దాని అనుబంధ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా సమాచారం సేకరించాలన్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వచ్చిన ఎంపీడీఓలను వారి యథాస్థానాలకు బదిలీ చేస్తూ బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బదిలీపై జిల్లాకు ఎంపీడీఓలు వారి స్థానాలకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని మండల పరిషత్ అధికారులు, సిబ్బంది సాధారణ బదిలీలపై స్పష్టత రావాల్సి ఉంది.

రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ- పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ సమావేశానికి వ్యవసాయ దాని అనుబంధ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైతులకు పంట సాయం, పంట నష్టరిహారం, పంటల బీమా సమాచారం సేకరించాలన్నారు.

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ జనవరి-2024 సంబంధించి డిగ్రీ 1వ సెమిస్టర్, 3వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్ లో పొందుపరిచామని అన్నారు. మరిన్ని వివరాల కోసం https://drbrau.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.

పొందూరుల ఖాదీఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఇటలీ, జర్మనీ, కెనడా, యూఎస్ఏ, నార్వే, థాయలాండ్ దేశాల విద్యార్థులు, ప్రముఖులు సందర్శించారు. సుమారు 900 మంది చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఈ వస్త్రం మీటరు రూ.341 ధర నుంచి అత్యధికంగా రూ.2,107లుగా ఉంది. పంచెలు రూ.2వేలు నుంచి రూ.10వేలు, చీరలు రూ.6 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఉన్నాయి. ఏటా వస్త్ర వ్యాపారం రూ.8 కోట్లు టర్నోవర్ ఉంటుందని వ్యాపారులు తెలిపారు.

పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా హౌరా(HWH)- యశ్వంత్‌పూర్(YPR) మధ్య ప్రయాణించే ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహణ కారణాల రీత్యా కొద్దిరోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 8, 15వ తేదీల్లో నం.02863 HWH- YPR, నం.02864 YPR- HWH రైలును ఆగస్టు 10, 17వ తేదీల్లో రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.