India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటనను పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇచ్ఛాపురం మున్సిపల్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలతో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కచ్చితంగా వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది వివిధ కారణాల చేత 4, 5, 6 తేదీలలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే 7, 8వ తేదీల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో ఓటు వేయొచ్చన్నారు.
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా హోం ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో సోమవారం జరగనుంది. దానికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు.
85 ఏళ్ల పైబడిన ఓటర్లు: 11,421
దివ్యాంగుల ఓటర్లు: 21,517
మొత్తం ఓటర్లు: 32,938
హోం ఓటింగ్‌కి దరఖాస్తు చేసుకున్న ఓటర్లు:
85 ఏళ్ల పైబడినవారు: 310
దివ్యాంగ ఓటర్లు: 185
మొత్తం ఓటర్లు: 495. హోమ్ ఓటింగ్ కోసం జిల్లాలో 188 ప్రత్యేక బృందాలను నియమించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 7 నుంచే సూర్యుడు చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్లు, ఏసీలు వేసుకున్నా ఊరట అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో భానుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ ఓ చల్లటి కబురు పంపింది. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన నందిగాం మధు (38) ఆదివారం ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో జిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒక్క ఫొటో.. MLA పదవిని కోల్పోయేలా చేసింది. 1989లో పాతపట్నంకు జరిగిన ఎన్నికల్లో TDP అభ్యర్థి కలమట మోహనరావు గెలుపొందారు. NTR కృష్ణుడి వేషంలోని బొమ్మతో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారని కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన నారాయణ హైకోర్టుకు వెళ్లారు. తీర్పుతనకు వ్యతిరేఖంగా వచ్చిందని కలమట సుప్రీంకోర్టుకు వెళ్లారు. తీర్పువచ్చేలోపే 1994లో వచ్చిన ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 1996లో తీర్పురాగా కలమట పదవి కోల్పోయారు.
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 7న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి NDA కూటమి తరుపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఆ రోజు 11.50కి విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 12.10కి ఎచ్చెర్ల హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.10 వరకు ఎచ్చెర్ల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
ఉద్దానంలో అంతర పంటగా పనసను సాగు చేస్తున్నారు. జీడి పిక్కల దిగుబడి లేని సమయంలో ఈ పంటతో వచ్చే ఆదాయం రైతులకు కొంత ఊరట కలుగుతుంది. అలాంటిది పనస దిగుబడి తగ్గగా గిట్టుబాటు ధరలేక రైతులు నిరాశ చెందుతున్నారు. మార్చి, ఏప్రిల్ వరకు కిలో కాయలు ధర రూ. 25 నుంచి రూ. 20 మధ్య ఉండేది. ప్రస్తుతం కిలో రూ.4 వరకు ధర పడిపోయింది. బయట రూ.5 నుంచి రూ. 10 వరకు అమ్ముతున్నారని, రైతు పండించే పంటకు మాత్రం ధర లేదని వాపోతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో దివ్యంగా ఓటర్లు 21,481 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 31,44 మంది, అత్యల్పంగా ఆముదాలవలస నియోజకవర్గంలో 2,255 ఉన్నారు. శ్రీకాకుళంలో 2,724, నరసన్నపేటలో 2,981, టెక్కలి 2,649, పాతపట్నం 2,380, పలాస 2,573, ఇచ్చాపురం 2,775 మంది ఓటర్లు ఉన్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
పోలింగ్ తేదీ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ప్రతి ఓటు కీలకమేనంటూ టెక్కలి ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తూ వారితో టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్ రోజు ఓటేసేలా రైల్వే, RTC, ప్రైవేటు బస్సులకు ప్యాకేజీలు మాట్లాడుతున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.