Srikakulam

News May 5, 2024

శ్రీకాకుళం:ఎన్నికల ప్రక్రియ పరిశీలించిన సహాయ కలెక్టర్

image

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శనివారం సాయంత్రం సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News May 4, 2024

శ్రీకాకుళం: డా.బిఆర్ఏయూ పరీక్ష తేదీల్లో మార్పు

image

ఎచ్చెర్ల డా.బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ సప్లిమెంటరీ 2, 4 సెమిస్టర్ల సప్లిమెంటరీ పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు డా.బిఆర్ఏయూ పరీక్షల విభాగం డీన్ డా.ఎన్.ఉదయభాస్కర్ శనివారం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ 17, 18వ తేదీల్లో జరుగుతాయని, డిగ్రీ నాలుగో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News May 4, 2024

టెక్కలి: ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య

image

టెక్కలి నియోజకవర్గం బోరుభద్ర గ్రామానికి చెందిన పొందూరు శివ కృష్ణ(32) అనే ఆర్మీ ఉద్యోగి శనివారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరలో గల ఒక లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మీ సెలవులకి వచ్చి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు శివ కృష్ణ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News May 4, 2024

శ్రీకాకుళం:ఎన్నికల ప్రక్రియ పరిశీలించిన సహాయ కలెక్టర్

image

సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శనివారం సాయంత్రం సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పరిశీలించారు. అనంతరం అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News May 4, 2024

శ్రీకాకుళం: భానుడి ప్రతాపానికి ప్రధాన రహదారులు ఖాళీ

image

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘ రోగాలు గల వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. భానుడి ప్రతాపంతో ఆమదాలవలస మండల పరిధిలో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండలో బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News May 4, 2024

శ్రీకాకుళం: ఆ ఛానెల్‌లో వచ్చిన వార్త అవాస్తవం

image

శ్రీకాకుళం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు శనివారం వెల్లడించారు. మూడు రోజులు పాటు 8 నియోజకవర్గ కేంద్రాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉందన్నారు. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉద్యోగులు వేచి ఉన్నట్లు తెలిపారు. ఓ ఛానల్‌లో నరసన్నపేటపై వచ్చిన వ్యతిరేక వార్త వాస్తవం కాదని సాఫీగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుందని ఆర్వో రామ్మోహన్ స్పష్టం చేశారు.

News May 4, 2024

శ్రీకాకుళం: దివ్యాంగ ఓటర్ల వివరాలు

image

జిల్లా వ్యాప్తంగా 21,481 మంది దివ్యాంగులు ఓటర్లుగా నమోదయినట్లు అధికారులు శనివారం వెల్లడించారు..
నియోజకవర్గాల వారీగా ఇలా …
ఇచ్చాపురం – 2775,
పలాస- 2573,
టెక్కలి – 2649,
పాతపట్నం- 2380,
శ్రీకాకుళం – 2724,
ఆమదాలవలస- 2255,
ఎచ్చెర్ల – 3144,
నరసన్నపేట- 2981,
మొత్తం – 21481

News May 4, 2024

రణస్థలం: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థితో నారా రోహిత్ భేటీ

image

ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నివాసానికి సినీ హిరో నారా రోహిత్ శనివారం ఉదయం విచ్చేశారు. ఆయనకు నియోజకవర్గ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావుతో నియోజకవర్గంలో కూటమి బలోపేతానికి తీసుకున్న చర్యలు, పార్టీకి వస్తున్న ఆదరణను రోహిత్‌కు వివరించారు. రానున్న ఎన్నికల్లో విజయమే గెలుపుగా అందరూ కృషి చేయాలని కోరారు.

News May 4, 2024

పాలకొండ: ఇంటి పెచ్చులు పడి 3 నెలల చిన్నారి మృతి

image

పాలకొండ మండలం వెలగవాడ గ్రామంలో విషాదం నెలకొంది. ఇంటి పై కప్పు పెచ్చులు ఊడి 3 నెలల చిన్నారి (ఊహా రాణి) మృతి చెందింది. ఉక్క పోతతో ఇంటి గడపలో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా .. తెల్లవారుజామున ఇంటి పై కప్పు పెచ్చు ఊడడంతో తలకి బలమైన గాయం తగిలింది. దీంతో చిన్నారి మృతి చెందింది. ఘటనలో  చిన్నారి అమ్మ, అమ్మమ్మకు స్వల్ప గాయాలయ్యాయి.

News May 4, 2024

శ్రీకాకుళం: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామ సమీపంలో శనివారం ఉదయం 8గంటల సమయంలో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.మృతి చెందిన వ్యక్తి పాలవలస గ్రామ వాసి అని.. సుమారు 46-50సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.