India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్‌లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.

నూజివీడులో ఉన్న విద్యార్థులను శ్రీకాకుళం IIIT క్యాంపస్ తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని IIIT డైరెక్టర్ ఆచార్య బాలాజీ, పరిపాలన అధికారి ముని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం క్యాంపస్‌లోని పలు సమస్యలను కేంద్ర మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు.

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే ఈస్ట్కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు 18046 రైలును ఆగస్టు 3 నుంచి 11 వరకు, 18045 ట్రైను ఆగస్టు 2 నుంచి 10 వరకు గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లవని, సమీపంలోని రాయనపాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామని అధికారులు తెలిపారు.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ, పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడి పరిశ్రమలను ఆదివారం నుంచి తెరుస్తున్నామని పలాస పారిశ్రామికవాడ జీడి పరిశ్రమల సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం వెల్లడించారు. జులై 19వ తేదీ నుంచి జీడి ఉత్పత్తులు పేరుకుపోవడంతో పరిశ్రమలు తాత్కాలికంగా బంద్ చేశామని చెప్పారు. ఆదివారం నుంచి బాయిలింగ్, కటింగ్ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో టెట్, డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను పొందేందుకు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గిరిజన విద్యార్థులు ఈ నెల 3 నుంచి 10వ తేదీ లోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు.

☛ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ☛ ఫిష్ హార్బర్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ☛ IIIT రెండో విడత కౌన్సెలింగ్ జాబితా విడుదల ☛ దివ్యాంగులకు అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ ☛ రాగోలులో డీసీఎం-లారీ ఢీ ☛ ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీలు ☛ చంద్రబాబును ప్రజలు మనసారా దీవిస్తున్నారు: ఎమ్మెల్యే

రాత్రి వేళలో ముమ్మురంగా పెట్రోలింగ్ చేయడంతో పాటు గస్తీ విధులు పటిష్టంగా నిర్వర్తించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి ఆమదాలవలస మండల పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌లోని రిసెప్షన్ కేంద్రంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు ముఖ్యమైన డ్యూటీ రిజిస్టర్ నిర్వహణ క్షుణ్ణంగా చూసి, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సిబ్బంది సూచించారు.

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు రాసిన పాత OMR ఆన్సర్ బుక్లెట్ల కోసం టెండర్లకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పీ.రజని పేర్కొన్నారు. అర్హత కలిగిన ఏజెన్సీల నుండి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అనంతరం పూర్తి వివరాలను https://drbrau.in/ పొందుపరిచామన్నారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం సాయంత్రం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఆలింకో) సహకారంతో వికలాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని శ్రీకాకుళం ఎస్పీ కే.మహేశ్వరరెడ్డి శనివారం కలిశారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మహిళా సంరక్షణ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీతో కేంద్ర మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. యువత పెడదారిన పడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. ఈ భేటీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ఉన్నారు.
Sorry, no posts matched your criteria.