India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లు త్వరితగతిన చేపట్టాలని శ్రీకాకుళం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని నమూన్ ఆదేశించారు. బుధవారం ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట పట్టణాల్లో సాధారణ ఎన్నికల కోసం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ లలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
కొత్త పోలవలస సర్పంచ్ అదృశ్యమైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేట మండలం కొత్త పోలవలస సర్పంచ్ వెంకట శ్యామ్‌కుమార్ బుధవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆయన భార్య ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇటీవల పలువురి నుంచి నగదు అప్పుగా తీసుకుని.. అది తీర్చలేక పోవడంతోనే మనస్తాపం చెంది వెళ్లిపోయారని తెలిపారు.
జిల్లా కేంద్రం నుంచి పలాసకు వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ మంగళవారం సాయంత్రం ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా సెల్ఫోన్‌లో మాట్లాడుతూ.. ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ప్రయాణికులు పలాస డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న మేనేజర్ మాట్లాడుతూ.. బస్సు విశాఖపట్నం డిపోకు చెందిందని, ఫిర్యాదును విశాఖపట్నానికి బదిలీ చేస్తానని ఫిర్యాదు దారునికి హామీ ఇచ్చారు.
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఇచ్చాపురానికి చెందిన ఏడేళ్ల బాలుడు పడాల పార్థివ్‌కు చోటు దక్కింది. గతంలో 1 నుంచి 50 వరకు క్యూబ్స్‌ను 1 నిమిషం 36 సెకన్లలో రాసి చోటు దక్కించుకున్నట్లు తండ్రి అప్పలనాయుడు, తల్లి లక్ష్మి పేర్కొన్నారు. అయితే ఇప్పుడు 1 నుంచి 100 వరకు క్యూబ్స్‌ను 4 నిమిషాల 24 సెకన్‌లలో చెప్పినందుకు ఈ గౌరవం దక్కిందని అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.
ఆముదాలవలసలో గల శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ఓ కార్మికుడు డ్రిల్లింగ్ మిషన్‌ను ఆపకుండా వదిలేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కావడంతో ఆ డ్రిల్లింగ్ మిషన్ ప్లాట్‌ఫామ్ పై ఓ ప్రయాణికురాలి కాలుకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికే కాలు విరగడంతో 108లో ఆసుపత్రికి తరలించారు.
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ విభాగాలు పొరపాట్లకు తావు లేకుండా పూర్తి సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. ఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు, నోడల్ అధికారులు, ఎన్నికల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. సీ- విజిల్, సువిధ, ఎంసీసీ తదితర అంశాలను గమనించాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఓపెన్ టెన్త్ పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. మొత్తం 79 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 68 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 11 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 145 కేంద్రాల్లో పది పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు మంగళవారం ఒక తెలిపారు. మొత్తం 29,108 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 28,662 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 446 మంది పరీక్షలకు హాజరుకానట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, మంగళవారం రాజాం, పలాస, సీతంపేట, టెక్కలి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రేపు పిడుగులు పడే ఆస్కారం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం పదో తరగతి హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని అధికారులు తెలిపారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహింగా..458 మంది విద్యార్థులు హాజరు కాలేదని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకుంటున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.