India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సమీపంలో గల శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం కొండ దిగువన శిల్పి గేదెల హరికృష్ణ రూపొందించిన శ్రీరాముని సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సైకత శిల్పం రూపొందించినట్లు హరికృష్ణ పేర్కొన్నారు. ఈ సైకత శిల్పాన్ని మంగళవారం తిలకించిన పలువురు భక్తులు ఆయనను అభినందించారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బూర్జ మండలం నీలంపేట గ్రామానికి చెందిన గౌరీ శంకర్ జై భారత్ నేషనల్ పార్టీ(జేబీఎన్‌వై) తరఫున MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం విడుదల చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో గౌరీ శంకర్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు ఖరారు చేశారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్‌లో సత్తా చాటాడు. NITలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకుని 467 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వెంకటేష్ తండ్రి చంద్రరావు, తల్లి రోహిణి వ్యవసాయం చేస్తూ.. గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తున్నారు. రెండో కుమారుడు వంశీ శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా చేస్తున్నాడు.
శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన అండర్- 19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పుల్లెల శాస్త్రి, హసన్ తెలిపారు. 2005 సెప్టెంబరు 1వ తేదీ తర్వాత జన్మించిన వారు పోటీలకు అర్హులని పేర్కొ న్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆరోజు ఉదయం 9 గంటలకు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని చెప్పారు. వివరాలకు 92466 31797 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
శ్రీకాకుళంలోని పలాస మండలం కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి రామభక్తి చాటుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా బంగారంతో సూది మీద నిలబడే రామబాణంను మంగళవారం తయారుచేశారు. ఏటా వివిధ ప్రత్యేకతలు కలిగిన రోజుల్లో ఆయా పండగలకు తగ్గట్టుగా సూక్ష్మ ఆకృతులు తయారుచేయడం అలవాటు అని చెబుతున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచే అభ్యర్ధుల ఖాతాలో ఖర్చు లెక్కించేందుకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గరనుంచీ అతని ఖాతాలో పక్కాగా ఖర్చు నమోదు చేయాలన్నారు.
ఈనెల 18వ తేదీ నుంచి సాధారణ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు రిటర్నింగ్ అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మంగళవారం BZA నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్‌గా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై మీనా సమీక్షించారు.
రానున్న ఎన్నికలలో జయం మనదేనని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుతో యువనాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పలాస సభ ముగించుకుని మంగళవారం తిరుగుప్రయాణం అయిన చంద్రబాబు హెలికాప్టర్ ఎక్కిన సమయంలో రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. కొన్ని నిమిషాల పాటు వారి మద్య మాటామంతి కొనసాగింది. చంద్రబాబు తిరుగుప్రయాణం అయినప్పుడు రామ్మోహన్ నాయుడు విక్టరీ సింబల్ చూపించి జయం మనదేనని ధీమాను వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో వేసవి వేడి గాలులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ సూచించారు. మంగళవారం ఆయన కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజరీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఆరోగ్య సదుపాయాలను పెంచడంతోపాటు వేడిగాలుల ఎక్కువగా ఉన్న సమయంలో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ యూపీఎస్సీ ఫలితాలలో 467 ర్యాంకు సాధించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలిపారు. మారుమూల గ్రామం నుంచి 467వ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మన్మధరావు, జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.