India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళంలోని UTF భవనంలో సంబంధిత టీచర్ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఫిబ్రవరి 6న పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీ నామినేషన్ వేస్తారని చెప్పారు. ఇందులో అందరూ పాల్గొనాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్ మూర్తి, సహాధ్యక్షులు ధనలక్ష్మి,రవికుమార్ పాల్గొన్నారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో బందోబస్తు విధులు నిర్వహణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.
శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి వెళ్తున్న భక్తుల కారులో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం విశాఖ మద్దిలపాలానికి చెందిన ఐదుగురు భక్తులు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ, శ్రీకూర్మనాథుడిని సోమవారం దర్శించుకున్నారు. శ్రీముఖలింగం వెళ్తుండగా దొంపాక వద్ద కారులో మంటలు వ్యాపించాయి. దీంతో వారు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు నియంత్రించారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భక్తులను ఆకట్టుకోవడానికి హెలికాప్టర్ రైడ్ ప్రకటించారు. భక్తుల నుంచి వస్తున్న స్పందన, డిమాండ్ మేరకు ఈ రైడ్‌ను ఈనెల 5వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు డ్వామా పీడీ బి.సుధాకర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రసిద్ధ సూర్య నారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అరసవల్లిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదిత్యునికి క్షీరాభిషేకం చేస్తామని ఈవో వై.భద్ర తెలిపారు. అనంతరం ప్రత్యక దర్శనాలు కల్పిస్తారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజ రూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
శ్రీకాకుళంలో ఉమెన్స్ కాలేజీలో ఓ విద్యార్థినిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నిందితుడు సారవకోటకు చెందిన జగదీశ్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ‘విజయనగరం(D) సంతకవిటికి చెందిన యువతి డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉంటోంది. గతంలో జగదీశ్‌తో ఆమెకు పరిచయం ఉంది. గతనెల 30న ఆమెను కలిసి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అతను దాడి చేసి గాయపరిచాడు’ అని ఎస్పీ చెప్పారు.
శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి విరాళాలు సమర్పించిన దాతలకు రథసప్తమి రోజున దర్శనానికి డోనర్ పాసులతో అవకాశం కల్పించామని ఈవో భద్రాజి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సదరు డోనార్ పాస్‌లు ఇచ్చే ప్రక్రియ రేపు (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆలయానికి విరాళం ఇచ్చిన దాతలు గమనించాలని కోరారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 3 తేదీ వరకు గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని మండలాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యవేక్షణ, సూచనల మేరకు శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సుమారు 5000 మందితో ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 12 రకాల ఆసనాలు వివరిస్తూ అందరితో చేయించారు. సూర్య నమస్కారం రెగ్యులర్ అభ్యాసం మెరుగైన మానసిక స్పష్టత వస్తుందన్నారు.
హాస్టల్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన పాలకొండలోని ఓ ఇంటర్ కళాశాలలో జరిగింది. ఎస్ఐ ప్రయోగమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.నిఖిల్ కళాశాల పైనుంచి శుక్రవారం పడి తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు పడి చనిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.