Srikakulam

News March 21, 2025

నందిగాం: జీడి చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి

image

నందిగామ మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన అక్కురాడ డిల్లేశ్వరరావు శుక్రవారం జీడి తోటలో ఉరేసుకుని చనిపోయాడు . జీడి పిక్కలు కోయడానికి వెళ్లిన తన తమ్ముడు చూసి, పోలీసులకు సమాచారం తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2025

గార: నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృత దేహం

image

గార మండలం కళింగపట్నం సమీపంలో వంశధార నదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 21, 2025

ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

image

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. 

News March 21, 2025

టెక్కలి: విద్యార్థుల సహనానికి “పరీక్ష”

image

టెక్కలిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులు మండుటెండలో అవస్థలు పడ్డారు. ఉదయం 8.45 గంటలకు కూడా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో మండుటెండలో నిలబడ్డారు. అధికారుల తీరుపై కొంత మంది తల్లిదండ్రులు గట్టిగా ప్రశ్నించడంతో విద్యార్థులను లోపలికి అనుమతించారు. 

News March 21, 2025

సారవకోట: భాను ప్రసాద్‌కు గేట్‌లో 38వ ర్యాంక్

image

సారవకోట మండలం కూర్మనాథపురం గ్రామానికి చెందిన భాను ప్రసాద్ గేట్ పరీక్షలో ప్రతిభ చాటాడు. ఈ మేరకు ఇటీవల విడుదలైన గేట్ ఫలితాలలో 73.75 మార్కులు సాధించి ఆల్ ఇండియాలో 38వ ర్యాంక్ సాధించాడు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగంలో మంచి మార్కులు సాధించి ఈ ఘనత సాధించాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News March 21, 2025

శ్రీకాకుళం: పావురం ఈకపై.. సునీత విలియమ్స్ చిత్రం

image

అంతరిక్ష కేంద్రం నుంచి సురక్షితంగా వచ్చిన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ గౌరవార్థం పావురం ఈకపై ఆమె చిత్రాన్ని గురువారం నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ రూపొందించారు. రాహుల్ గతంలో కూడా పక్షుల వెంట్రుకలపై శ్రీనివాస కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం, కృష్ణుడు, ఆదిత్యుడు మరెన్నో చిత్రాలు గీశారు. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు పొందారు.

News March 21, 2025

SKLM: నేడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్

image

ప్రతి నెల మూడవ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం మార్చి 21న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 20, 2025

SKLM: హాస్టళ్లలో నాణ్యత పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

image

శ్రీకాకుళం జిల్లాలోని సంక్షేమ శాఖ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహార నాణ్యతను పర్యవేక్షించడానికి తొమ్మిది మందితో జిల్లా స్థాయి కమిటీని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అన్ని సంక్షేమ శాఖ హాస్టళ్లను పర్యవేక్షిస్తుంది. ఈ కమిటీకి కలెక్టరే ఛైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు.

News March 20, 2025

గేట్ ఫలితాల్లో యువతి సత్తా 

image

శ్రీకాకుళం క్యాంపస్ (ఎచ్చెర్ల) త్రిబుల్ ఐటీ చదువుతున్న విద్యార్థినీ గేట్-2025లో ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం క్యాంపస్ విద్యార్థులు కొమరాల శ్వేత శ్రీ, 241, అప్పన్న శ్రీనివాస్ 663 ర్యాంక్‌లు వచ్చాయని డైరక్టర్ ఆచార్య బాలాజీ తెలిపారు. విద్యార్థినిని బాలాజీ గురువారం అభినందించారు.

News March 20, 2025

SKLM: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు

image

జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చెసుకుంటానని చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకోవాలని అడిగితే ససేమిరా అన్నాడు. మరోక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సే మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.