India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చెసుకుంటానని చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకోవాలని అడిగితే ససేమిరా అన్నాడు. మరోక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సే మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొందూరు 38.2, ఆమదాలవలస 38.5, జి.సిగడాం 39.3, జలుమూరు 38.7, సరుబుజ్జిలి 39.2, సారవకోట 38.9, బూర్జ 39.5, నరసన్నపేట 37.6 ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి పూజిత నేడు విడుదలైన గేట్-2025 ఫలితాలలో ఆల్ ఇండియా 25 ర్యాంకు సాధించారు. పూజిత నాగపూర్‌లోని వీఎన్ఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పూజిత తండ్రి పైడి శ్రీనివాసరావు ఎల్.ఎన్.పేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పూజిత తల్లి ఆదిలక్ష్మి గృహిణి. గేట్‌లో వంద మార్కులకు గాను 73 మార్కులు సాధించినట్లు తండ్రి శ్రీనివాస రావు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను DEO తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 28,020 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 27,891 మంది హాజరైనట్లు వెల్లడించారు. 129 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఎక్కడా జరగలేదన్నారు. ప్రయివేటు విద్యార్థులు 14 మంది గైర్హాజరయ్యారన్నారు.
అవినీతి కోసమే పథకం అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాహనాల కొనగోళ్లు, నిర్వహణలో తప్పులు జరిగాయని తెలిపారు. వీటిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాని పేర్కొన్నారు. నివేదిక సంతృప్తిగా లేకుంటే మరో ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.
సొంత మేనమామ పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కవిటి మండలంలోని రాజపురం పంచాయతీ తొత్తిపుట్టుగలో మార్చి11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్యాయంగా చూడాలస్సిన మేనమామ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నొప్పి భరించలేక బాలిక కేకలు పెట్టడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటనపై డీఎస్పీ వెంకట అప్పరావు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శ్రీకాకుళం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు, పాదచారులు చాలాచోట్ల మజ్జిగ, పండ్ల రసాలు తాగుతున్నారు. మరో రెండు నెలలు జిల్లాలో ఎండల తీవ్రంగా ఉంటే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
ఎచ్చెర్ల మండలంలో భార్యను, భర్త దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఎచ్చెర్లలోని సంతసీతాపురానికి చెందిన నాగమ్మ(40), అప్పలరెడ్డి కూలిపనులు చేస్తూ జీవనం సాగించేవారు. భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటిలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కత్తితో తల, మెడలపై దాడి చేయగా ఆమె మృతి చెందింది. కుమారుడు త్రినాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ అవతారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీ ఐ)లో ఈనెల 20 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Sorry, no posts matched your criteria.