India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27 తేదీన జలుమూరు మండలం ఎస్టీ మాకివలస, హిరమండలం మండలం అంతక పిల్లి, పునుపేట, సవితి సిది, గిరిజన గ్రామాల్లో పర్యటిస్తారు. 28 తేదీన ఆమదాలవలస మండలం, అల్లిపిల్లి గూడా, పర్యటించి అక్కనుంచి పాతపట్నం మండలం, నల్ల బొంతు గిరిజన గ్రామం పర్యటిస్తారని తెలిపారు.
సీతంపేట మండలం అడ్డాకులగూడ సమీపంలో సోమవారం ఉదయం పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే రోడ్డులో ఒడిశా వెళ్తున్న భారీ పరిశ్రమల ఉపకరణాల లారీ బోల్తా పడింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న 33 కెవి విద్యుత్ తీగలు తెగిపోయి విద్యుత్ అంతరాయం జరిగింది. దీంతో ఈ భారీ వాహనాలు వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
శ్రీకాకుళం: ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా సోమవారం నుంచి వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు డీఎసీవో కె.శ్రీధర్‌రావు తెలిపారు. క్రీడావికాస కేంద్రాల్లో పోటీలు జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో రాణించిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.
ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక వార్షికోత్సవం సందర్భంగా ఆగస్టు 29 న శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామంలో జిల్లా స్థాయి కవి సమ్మేళనం, పాటల పోటీ నిర్వహిస్తున్నారు. కవి సమ్మేళనంలో పాల్గొనే ప్రతి కవికి జ్ఞాపిక, సర్టిఫికేట్ అందిస్తారని నిర్వాహకులు తెలిపారు. పాటల పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
రణస్థలం మండలం బంటుపల్లి జంక్షన్ సమీపంలో బీరు ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. పైడి భీమవరం నుంచి రణస్థలం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. వీరి ఇరువురు తండ్రి కొడుకులుగా స్థానికులు భావిస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లా రేగడి ఆమదాలవలస మండలానికి చెందిన వారని సమాచారం.
వజ్రపుకొత్తూరు మండలం తెరపల్లి గ్రామంలో శనివారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో గ్రామానికి ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా.. పురాతన కట్టుబాట్లతో రాత్రి అయిందని ఊరు పొలిమేరలో మృతదేహాన్ని గ్రామస్థులు నిలిపివేశారు. రోజులు మారినా పద్ధతులు మారలేదని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ అధికారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాణిజ్య పన్నుల శాఖ సహాయ సంచాలకులు రాణి మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తదనుగుణంగా వ్యాపారులకు సమాచారం అందజేస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు నకిలీ వ్యక్తులు జీఎస్టీ అధికారులంటూ చెబుతూ సంబంధిత సంస్థల్లోకి చొరబడుతున్నారని, ఎవ్వరైనా జీఎస్టీ అధికారులమని వస్తే ఐడీ చూపించాలని అడగాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ జాబితాలో కాశీబుగ్గకు చోటు దక్కడంతో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు క్యాంప్ కార్యాలయానికి ఆదివారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వస్తున్నారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుంటారని అన్నారు. కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అన్నారు.
భామిని మండలం తాలాడ గ్రామానికి చెందిన కౌలురౌతు నిరంజన్ (50) వంశధార నది లో పడి మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. గురవారం వంశధార నదిని దాటి ఒడిస్సా లోని కాశీనగర్ వెళ్లారు. తిరిగి నదిని దాటే క్రమంలో ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతయ్యాయి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం మృతదేహం లభించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.