India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు 2025 నూతన సంవత్సరంలో ఏర్పరుచుకున్న, నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి, వేడుకలను ప్రశాంతంగా ఇళ్ల వద్దనే జరుపుకోవాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ముందస్తు నిఘా, సమాచార సేకరణ, సత్వర స్పందన, సమర్థవంతమైన నియంత్రణ వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో 2024 నేర గణాంకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 2023లో 11,017 కేసులు నమోదు అవ్వగా 2024లో 9,434 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 2023 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య 17 శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన అవకాశం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమమని ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదుకి డిసెంబర్ 31 చివరి రోజు కావడంతో పార్టీ సభ్యత్వ నమోదు కాని గ్రామాలలో, వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాల్సిందిగా కోరారు. సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొనవలసిందిగా కోరారు.
● బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్ మద్యం పార్టీలు ఏర్పాటు చేయరాదు● మద్యం దుకాణాలు ఎక్సైజ్ శాఖ విధించిన నిర్ణీత సమయంలో మూసివేయాలి● మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు, సీజ్● అశ్లీల నృత్యాలకు చోటు లేదు. ● వేడుకల్లో మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు● బాణసంచా కాల్చడంపై ఆంక్షలు● శుభాకాంక్షల పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే జైలు శిక్ష
ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడంలేదని, ఎవరూ శుభాకాంక్షలు చెప్పడానికి తన నివాసానికి రావద్దని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో సంతాప దినాలు పాటిస్తున్నానని, ఇందులో భాగంగానే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడంలేదని, అభిమానులు, శ్రేయోభిలాషులకుతెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్లు భద్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి సోమవారం తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్‌లో పరిస్థితి అంతా సాధరణంగానే ఉందని జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.
కంచిలి జాతీయ రహదారి పక్కన పబ్జీ దాబా సమీపంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మండలంలోని బాసు బంజీరికి చెందిన బొండాడ రామారావు (45) విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మేకల ఆహారానికి దాబా సమీపంలోని పొలానికి వెళ్లారు. చెట్టు కొమ్మలు కోస్తుండగా విద్యుత్ తీగ తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీతంపేట మండలం జొనగ గ్రామానికి చెందిన ఎస్.రాజయ్య చిన్న కుమారుడు ఎస్.పవన్ కుమార్ (5) బాలుడు ఆడుకుంటూ వాటర్ ట్యాంక్‌లో పడి మరణించాడు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. నీటి ట్యాంక్‌లో పడిన బాలుడిని తల్లిదండ్రులు హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
2024లో సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి శ్రీకాకుళం రాజకీయ ముఖచిత్రం మార్చేశాయి. శ్రీకాకుళం MPతో పాటు 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలిచింది. అందులో జనసేన 1, BJP 1 స్థానం కైవసం చేసుకున్నాయి. ఎచ్చెర్ల ఎన్.ఈశ్వరరావు, పలాస గౌతు శీరిష, పాలకొండ నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం గొండు శంకర్, పాతపట్నం మామిడి గోవిందరావు మొదటిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి వరించడం విశేషం
వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశిబుగ్గ పట్టణానికి చెందిన శివ(24) మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు కాశీబుగ్గ న్యూ కాలనీలో నివాసం ఉంటూ.. ఓ ప్రముఖ డాక్టర్ వద్ద కార్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, అక్క భర్త (బావ) మృతి చెందగా.. తల్లిని, సోదరిని పోషిస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో శివ మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.