India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు. విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగస్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. బ్రిటిషు వారికి అప్పటి ఈ ప్రాంత రైతులు పన్నును గుడ్డ సంచిలో సమర్పించేవారు. బ్రిటిష్ వారు ఆ మూటల మూతికట్టు విప్పమని చెప్పడానికి చికాకోల్ అనేవారు. అంటే “మూతికట్టువిప్పు” అని అర్థం. ఈ మాట క్రమంగా “చికా కోల్” అయి, శ్రీకాకుళంగా స్థిరపడింది అని అంటారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహమ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నెల మూడో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వారి సలహా మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌లో 1942వ సంవత్సరంలో జాతిపిత గాంధీజీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రైలులో ప్రయాణించి, రైల్వేస్టేషన్‌లో దిగి ఉద్యమం గురించి 15 నిమిషాల పాటు ప్రసంగించారు. అప్పుడే రైల్వేస్టేషన్ ఆవరణలోనే గాంధీజీ మర్రి మొక్కను నాటినట్లు పూర్వీకులు చెబుతున్నారు. 81 సంవత్సరాల క్రితం నాటిన మొక్క రెండెకరాల విస్తీర్ణంలో వృక్షమై ఉంది. గాంధీజీ నాటిన వృక్షంగా భావిస్తున్నారు.
సీతంపేట మండలం కిల్లాడ గ్రామ సచివాలయ సెక్రటరీ అల్లాడ అప్పలస్వామి అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన స్వగ్రామం వీరఘట్టం మండలం ఎం.రాజపురం. సచివాలయ సెక్రటరీగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వ్యక్తి ఇలా అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాజాం పట్టణం కాస్పావీధికి చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణ కళాకారుడు ముగడ జగదీశ్ మరోసారి ప్రతిభ కనబరిచారు. 0.060 మిల్లీ గ్రాముల బంగారు తీగతో సూక్ష్మ స్వర్ణ భారతంను 30 నిముషాల వ్యవధిలో తయారుచేసి ఔరా అనిపించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దీనిని తయారుచేసి దేశ భక్తిని చాటుకున్నాడు. అనేక కళాకృతులు అందంగా తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ప్రతి పౌరుడు తన ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కోరారు. బుధవారం కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అనంతరం మాట్లాడారు.
యోగా అండ్ ఫిట్నెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆఫర్ చేస్తున్న ఆరు నెలల వ్యవధిగల యోగా డిప్లొమా కోర్సులకు ప్రవేశానికి ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డా.బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి.సుజాత బుధవారం తెలిపారు. ఎటువంటి అదనపు రుసుం లేకుండా వీటిని ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతినెల మూడో శుక్రవారం దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కే కవిత బుధవారం తెలిపారు. దివ్యాంగుల నుంచి వినతులు స్వీకరిస్తున్నట్లు ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఆగస్టు 16న ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఆయన భార్య వాణి ఆరో రోజు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. పిల్లలను, తనను భర్త ఇంట్లోకి రానివ్వట్లేదని కారు షెడ్డులో దీక్ష చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటికే దువ్వాడ శ్రీను, వాణి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వివాదం సద్దుమణిగేలా ఇరు కుటుంబ సభ్యులు చర్చలు జరుపుతున్నారు.
Sorry, no posts matched your criteria.