India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంతకమిటి మండలం మల్లయ్యపేటలో రైతు కుటుంబం నుంచి ssc ఫలితాలలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఒక చిన్న గ్రామంలో నలుగురు ఉద్యోగాలు పొందడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన బొడ్డేపల్లి రాజశేఖర్(BSF), పేడాడ భవాని(BSF), పొట్నూరు శివప్రసాద్ సీఆర్పిఎఫ్, పోతిన శివ ఏఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నరసన్నపేట మండలం ఉర్లాంలోని నివసిస్తున్న దొంపాక వరహాలమ్మ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం బారిన పడి ఆమె శనివారం మృతి చెందింది. వరహాలమ్మ తమ్ముడు కొన్నేళ్ల క్రితం మరణించారు. అయితే ఆమె మృతి విషయం తెలుసుకున్న వరహాలమ్మ తమ్ముడి భార్య లక్ష్మి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మృతురాలికి ఎవరూ లేకపోవడంతో తానే స్వయంగా ఆడపడుచుగా లక్ష్మీకి తలకొరివి పెట్టింది.
జిల్లాలోని BRR వంశధార, నారాయణపురం ఆనకట్ట, మైనర్ ఇరిగేషన్ కింద మొత్తం 2,628 నీటి సంఘాల ప్రాదేశిక స్థానాలకు శనివారం ఎన్నికలు జరగగా 2606 స్థానాలకు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. పలు కారణాలతో ఇంకా 22 ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 344 నీటి సంఘాలకు గాను రెండు మినహా మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా ఎన్నికల ఘట్టం ముగిసింది. గెలుపొందిన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
భామిని మండలం పాత ఘనసరకి చెందిన చౌదరి సిసింద్రీ అనే యువకుడు ఒకే రోజున రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైయ్యాడు. CISF, CRPFలో సెలెక్ట్ కావడం అతని ప్రతిభకు నిదర్శనమని గ్రామస్థులు అంటున్నారు. బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత రాత పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కులు, ఫిజికల్ టెస్టులో కనబరిచిన నైపుణ్యంతో రెండు ఉద్యోగాలకు ఎంపికైయ్యాడని తండ్రి జగన్నాథం, తల్లి రవణమ్మ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీచేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు ఆయనకు నోటీసులు అందించారు. ఇటీవల కాలంలో జనసేన నాయకులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కాగా ఈ మేరకు టెక్కలి పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేశారు.
టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పిట్ట రాజేశ్వరి, పిట్ట రామ్మోహన్ దంపతులపై వారి సమీప బంధువులు ఇద్దరు కత్తితో హత్యాయత్నం చేశారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో భార్యాభర్తలపై దాడి జరిగినట్లు గ్రామస్థులు అంటున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. చలిగాలుల ఉద్ధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు. గ్రామాల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకొని కాచుకుంటున్నారు. ఎండ వచ్చి చలి తీవ్రత తగ్గాకే పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతకు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించి, గత 6 నెలలుగా అక్కడి జైల్లో మగ్గుతున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ మేరకు శ్రీలంకలోని భారత ఎంబసీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి, ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం సమాచారం అందించారు. శ్రీకాకుళం నుంచి వేటకు వెళ్లి, ఆనుకోకుండా శ్రీలంక సముద్ర జలాల్లోకి చేరుకోవడంతో కోస్టుగార్డు పోలీసులు అరెస్టు చేశారు.
డిసెంబర్ 14వ తేదీ శనివారం జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జిల్లా మొత్తం మీద 19 బెంచీలు నిర్వహించామని దీనిని జిల్లాలో గల ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులు జిల్లా అంతటా పరిష్కార చేస్తామని తెలిపారు.
ఏపీ ప్రభుత్వం నియమించిన షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా (రిటైర్డ్) ఈనెల 16న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ ఛైర్మన్ 16న ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని, 11 గంటల నుంచి 2 గంటల వరకు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమవుతారు.
Sorry, no posts matched your criteria.