India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నేడు (నవంబర్ 3న) ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదిక, శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో అర్జీదారులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. వినతులు సమర్పించిన అనంతరం వాటి స్థితిని తెలుసుకొనేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

కాశీబుగ్గ వేంకన్న ఘటన నేపథ్యంలో ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అలాగే కేంద్రం మృతుల కుటుంబానికి రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించింది. మొత్తంగా చనిపోయిన కుటుంబానికి రూ.17లక్షలు, గాయపడిన వారికి రూ.3.50లక్షల అందనుంది. మృతుల్లో TDP కార్యకర్తలు ఉండటంతో రూ.5లక్షల చొప్పున ఇన్సురెన్స్ రానుంది.

గార(M) వమరవెల్లి డైట్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 3 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 8 లెక్చరర్ పోస్టులు (డిప్యూటేషన్‌పై) నవంబర్ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ జడ్పీ, మున్సిపల్ హైస్కూల్స్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్స్ లీప్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

కాశీబుగ్గలోని తమ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సాధారణంగా 2 వేల మంది వస్తుంటారని.. ఇంతమంది వస్తారని ఊహించలేదని నిర్వాహకుడు హరిముకుంద్ పండా అన్నారు. రద్దీ ఇంత ఉంటుందని తెలియక పోలీసులకు చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ స్పందించింది. ‘ఇంత మంది ఎప్పుడూ రాలేదని’ ఆలయ ధర్మకర్తలే అంటుంటే ముందస్తు సమాచారం ఉంది అంటూ శవ రాజకీయం చేసే పార్టీ ఏపీలో ఉండటం దురదృష్టకరమని TDP మండిపడింది.

కాశీబుగ్గలో వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భోపాల్ పర్యటన రద్దు చేసుకున్న ఆయన.. కాశీబుగ్గకు బయలుదేరారు. అటు మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు బయలుదేరారు. మొదట విశాఖ వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు.

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వందలాది దేవతామూర్తుల విగ్రహాలతో <<18168511>>హరిముకుందా పండా అద్భుతంగా నిర్మించారు<<>>. తిరుమల శ్రీవారి విగ్రహంలా 9అడుగుల ఏకశిల విగ్రహాన్ని తిరుపతి నుంచే తెప్పించి ప్రతిష్ఠ చేశారు. పలాసకే ఈ గుడి తలమానికంగా నిలిచింది. దీంతో భక్తులు భారీగా ఆలయానికి వస్తుంటారు. హరిముకుంద ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆలయంలో ప్రత్యేకతలు ఒడిశా సంప్రదాయానికి దగ్గరగా ఉంటాయి.

కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని హోం మంత్రి ఆదేశించారు. ఆలయానికి ప్రతి శనివారం 1500 నుంచి 2 వేల మంది వస్తుంటారని చెప్పారు. ఆలయంలో మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా రెయిలింగ్ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని చెప్పారు.

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్దకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి తొక్కిసలాటకు కారణాలపై స్థానికులను, భక్తులతో ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటనలో మృతులు, క్షతగాత్రుల వివరాలు, ఆస్పత్రిలో చికిత్స అందుతున్న పరిస్థితిపై పర్యవేక్షించారు. వీరితో పాటు పలువురు జిల్లా అధికారులు ఉన్నారు.

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 10 మంది వరకు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూంను జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. ప్రమాదంపై సమాచారం కొరకు 08942 240557 కంట్రోల్ రూం నంబర్‌ను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 10కి చేరింది. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో టెక్కలి మండలానికి చెందిన ఇద్దరు మహిళలు ఉన్నారు. టెక్కలి(M) రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి, పిట్టలసరియాకి చెందిన రాపాక విజయ అనే ఇద్దరు మహిళలు మరణించినట్లు గుర్తించారు. దీంతో ఆయా గ్రామాల్లో, కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.