India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రథసప్తమి ఏర్పాట్లను SKLM జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పరిశీలించారు. సూర్య నమస్కారాలు నిర్వహించబోయే 80 అడుగుల రోడ్డు వద్ద ఏర్పాట్లు, అక్కడే పార్కింగ్ ఏర్పాట్లు పై జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఎస్పీ వివేకానందతో చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. నగరంలో మిల్లు జంక్షన్, పాలకొండ రోడ్డులో జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.
శ్రీకాకుళం మహిళా కళాశాల ప్రాంగణంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం-3 వార్డెన్ ఎం.పూర్ణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాత్రి హాస్టల్ విద్యార్థినిపై జరిగిన దాడి నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ విద్యార్థినిపై వ్యక్తులు దాడి చేసిన విషయం సంచలనం కావడంతో యుద్ధప్రాతిపదికన కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ముందు టైరు పేలడంతో డివైడర్‌ని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు సహాయంతో కారుని రోడ్డు పక్కన ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించారు.
అరసవల్లి రథసప్తమి వేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమవుతాయని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
లైంగిక దాడిలో గాయపడ్డ శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినికి రిమ్స్ ICUలో చికిత్స కొనసాగుతోంది. కాగా విద్యార్థినికి ముఖం, మోచేయిపై తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినికి ఆసుపత్రి వైద్యులు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థిని కాల్ డేటా, సీసీ ఫుటేజీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు, హోం మంత్రి అనిత ఆరా తీశారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి భక్తులందరూ సహకరించాలని ఏఎస్పీ రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ప్రతి ఒక్కరు విధిగా పాటిస్తూ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థినిపై లైంగికదాడి ఆరోపణల ఘటనపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో ఫోన్లలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అపస్మారక స్థితిలో రిమ్స్ ఆస్పత్రికి తరలించిన యువతికి మెరుగైన వైద్య సదుపాయాలందించాలని ఆదేశించారు. నిందితుల కోసం ఇప్పటికే 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ హోం మంత్రికి వివరించారు.
శ్రీకాకుళం నగరంలో గురువారం రాత్రి డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడిపై తక్షణమే విచారణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి, డీఎస్పీ వివేకానందతో ఫోన్‌లో మాట్లాడి.. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద ఉన్న రసాయనిక పరిశ్రమలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరిశ్రమలో కూలింగ్ టవర్ ఫ్యాన్లు తెగి పడడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వీరిని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో గురువారం అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఆసుపత్రిలో ఒక శిశువు తొడలో వ్యాక్సిన్ సూది ఉండిపోయిన ఘటనపై జిల్లా డీసీహెచ్ఎస్ డా.కళ్యాణ్ బాబు ఆదేశాల మేరకు నరసన్నపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీపాన శీనుబాబు విచారణ చేపట్టారు. విచారణలో సదరు సూది వ్యాక్సిన్ వేసిన ఇంజక్షన్ సూదిగా అధికారులు నిర్ధారించారు. తదుపరి చర్యలకు నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.