Srikakulam

News July 4, 2024

జనవాసాల్లోకి చుక్కల దుప్పి

image

అటవీ ప్రాంతం నుంచి దారి తప్పిన ఓ చుక్కల దుప్పి జనావాసాల్లోకి వచ్చింది. దీనిపై కుక్కలు దాడి చేయడంతో శ్రీకాకుళం జిల్లా మందస మండలం కంచుమాయమ్మ కాలనీలోని ఓ ఇంటిలోకి ప్రవేశించింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. వెనుక కాలికి తీవ్ర గాయం అవ్వడంతో పశువైద్య సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం బుడంబో సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

News July 4, 2024

శ్రీకాకుళం: 5,6 తేదీల్లో పలు రైళ్ల రద్దు

image

పలాస-విశాఖపట్నం మెయిన్ రైల్వే లైన్‌లో జరగనున్న భద్రత, ఆధునీకరణ పనుల నేపథ్యంలో ఈనెల 5వ తేదీన జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 5న పలాస-విశాఖ ప్యాసింజర్, గునుపూర్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-బరంపురం ప్యాసింజర్, విశాఖ-భువనేశ్వర్(ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్) రైళ్లతో పాటు 6వ తేదీన బరంపురం-విశాఖ, భువనేశ్వర్-విశాఖ ఇంటర్ సిటీ రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News July 4, 2024

అచ్చెన్నాయుడుతో మంత్రి రవీంద్ర భేటి

image

మంత్రి అచ్చెన్నాయుడును రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. అధికారులతోనూ ఇటు ప్రజాప్రతినిధులతో వివిధ అంశాల వారీగా అచ్చెన్న సమీక్షలు నిర్వహిస్తున్నారు.

News July 4, 2024

ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి: మంత్రి రామ్మోహన్

image

శ్రీకాకుళంలో గవర్నెన్స్ అంశాలపై ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. డిగ్రీ/పీజీ చేసిన వారు 6 నెలల ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన వారికి ప్రతినెలా స్టైపెండ్ ఇస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 1 నుంచి జనవరి 2025 వరకు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందన్నారు.

News July 4, 2024

ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలిశెట్టి

image

ఢిల్లీ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీ విమానాశ్రయంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుకు ఎంపీ కలిశెట్టి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.

News July 4, 2024

నరసన్నపేట: ‘104 సిబ్బంది సమస్యలను పరిష్కరించండి’

image

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 104 వైద్య సేవలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రమణమూర్తికి వినతి పత్రం సమర్పించారు. బుధవారం జిల్లాలోని 104 సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తాము వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తూనే ఉన్నామని, కాని తమ సమస్యలు పరిష్కారం అవ్వడంలేదని ఆయనకు విన్నవించుకున్నారు.

News July 4, 2024

శ్రీకాకుళం: నేడు మన్యందొర జయంతి వేడుకలు

image

అల్లూరి సీతారామ రాజు జయంతిని జూలై 4న కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మనజీర్ జిలాని తెలిపారు. జిల్లా అధికారులు, కలెక్టరేట్ ప్రాంగణంలోని అధికారులు, సిబ్బంది ఈ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని జిల్లా, డివిజినల్, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లోనూ అల్లూరి జయంతి వేడుకలను నిర్వహించాలన్నారు.

News July 4, 2024

రైల్వే రాయితీని పునరుద్ధరించాలి: ఎంపీ కలిశెట్టి

image

కోవిడ్ సమయంలో జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఢిల్లీలో సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్ ఛార్జీలలో రాయితీని పెంచాలని.. అలాగే వికలాంగులకు రాయితిని అందించే సౌకర్యాలు పెంచాలన్నారు.

News July 3, 2024

శ్రీకాకుళం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

* M.com పరీక్షల టైం టేబుల్ విడుదల * రేపు శ్రీకాకుళంలో ఘంటసాల గీతామృత మహోత్సవాలు * ఏపీఎల్‌లో సిక్కోలు ఆటగాడి ప్రతిభ * నంద్యాల జిల్లా కలెక్టర్‌గా టెక్కలి వాసి* హత్రాస్ బాధితులకు మంత్రి రామ్మోహన్ నాయుడు సానుభూతి * ఆపదలో ఆదుకున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ * రేపు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

News July 3, 2024

శ్రీకాకుళం: వాయిదా పడ్డ డిగ్రీ పరీక్షలు

image

విద్యార్థి సంఘాల బంద్ కారణంగా గురువారం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రేపు జరగాల్సిన 2, 4వ సెమిస్టర్ డిగ్రీ(రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షలను వాయిదా వేశామని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలపింది. వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.