India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుంభమేళాకి శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి, ఏ.విజయకుమార్ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో కుంభమేళాకి సంబంధించిన కరపత్రాలను/బ్యానర్లను ఆవిష్కరించారు. టికెట్లు www.apsrtconline.in ద్వారా శ్రీకాకుళం బస్ స్టేషన్‌లో పొందవచ్చని సూచించారు. వివరాలకు 99592 25608, 99592 25609, నంబర్‌లను సంప్రదించాలన్నారు.
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో శిశువు తొడలో <<15299625>>ఇంజెక్షన్ సూది<<>> ఉండిపోయిన ఘటనపై బుధవారం జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈమేరకు బుధవారం ‘టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం’ అనే శీర్షికతో Way2Newsలో కథనం రావడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై తక్షణమే విచారణ చేసి నివేదిక ఇవ్వాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి అధికారులను జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయకర్త (DCHS) ఆదేశించారు.
టెక్కలిలో జిల్లా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఈ నెల 24న సంతబొమ్మాళి మండలం పెద్దమర్రిపాడు గ్రామానికి చెందిన టీ కల్పన అనే మహిళ ఆసుపత్రిలో డెలివరీ అయ్యింది. పుట్టిన మగ శిశువుకు ఆ రోజు మధ్యాహ్నం వ్యాక్సిన్ వేసే క్రమంలో ఇంజక్షన్ సూది శిశువు తొడ భాగంలో ఉండిపోయింది. దీన్ని కుటుంబసభ్యులు మంగళవారం గుర్తించారు. బుధవారం ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా స్పందించలేదని బాధితులు ఆరోపించారు.
ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల పరీక్షలు ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఎస్.ఉదయ్ భాస్కర్ మంగళవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను జ్ఞానభూమి వెబ్సైట్, విశ్వవిద్యాలయ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచామన్నారు. రీవాల్యుయేషన్‌కు 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మార్కుల జాబితాలు విద్యార్థులకు అందజేస్తామని చెప్పారు.
బావపై బావమరిది దాడి చేసన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు శ్రీకాకుళంలోని గోల్కొండరేవులో ఉన్న రామకృష్ణ, మొండేటీవీధికి చెందిన హేమలతను పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మంగళవారం అత్తవారి ఇంటికి వెళ్లిన రామకృష్ణ భార్య తనతో రావాలని గొడవ చేయగా బావ సతీష్ రాడ్డుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సై ఎం. హరికృష్ణ కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలాస, టెక్కలికి వెళ్లే బస్సులు రామలక్ష్మణ్ జంక్షన్ నుంచి పెద్దపాడు రోడ్డు మీదగా ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల సూచన మేరకు తాత్కాలికంగా బలగ జంక్షన్ నుంచి రాగోలు మీదుగా రాకపోకలు సాగిస్తాయని డిపో మేనేజర్ శర్మ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. యథాతథంగా రాకపోకలు సాగించేందుకు త్వరలో ప్రకటన విడుదల చేస్తామన్నారు.
అరసవెల్లి రథసప్తమి వేడుకలకు వచ్చే నెల 2, 3 తేదీలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్, జిల్లా స్థాయి వెయిట్‌లిఫ్టింగ్, గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల విజేతకు రూ.లక్ష, జిల్లా స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల విజేతకు రూ.20 వేలు, గ్రామీణ క్రీడల విజేతలకు మొత్తం రూ.60 వేలు, చొప్పున ప్రైజ్ మని ఉంటుందన్నారు.
అరసవల్లి రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ మంగ్లీ, జాతీయస్థాయి సంగీత కళాకారులు, నర్తకులు ఈ వేడుకలకు రానున్నారు.
కోటబొమ్మాళి మండలం పాడుగుపాడు సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. స్థానికులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బోరుమజ్జిపాలేనికి చెందిన కరుకోల శ్రీనివాసరావు (55) పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఎస్సై వి సత్యనారాయణ కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ వారి ఆదేశాలు మేరకు ‘కోర్టుల సముదాయం టెక్కలిలో మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఫుల్ అడిషనల్ ఇన్‌ఛార్జి సీనియర్ సివిల్ జడ్జి ఛైర్మన్జె. శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.