India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పింఛను సొమ్ము కోసం సచివాలయ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన ట్రిపుల్ ఐటీ సమీపంలోని రాజీవ్ స్వగృహ కాలనీ వద్ద శుక్రవారం జరిగింది. బాధితుని కథనం..ఎస్ఎం పురం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ విష్ణు ఎచ్చెర్ల SBIలో రూ. 24 లక్షలకు పైగా డ్రా చేసుకుని వస్తున్నారు. గమనించిన ఇద్దరు ఆగంతకులు బైకు ఆపే ప్రయత్నం చేసి, రాడ్డుతో దాడి చేయగా తప్పించుకుని సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం చరిత్రను వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రసాద్ పథకం కింద అరసవిల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రూ.100 కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు.
శ్రీకాకుళం జిల్లాలో నేడే పింఛను లబ్ధిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,14,386 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం ప్రతినెల రూ.129 కోట్లకు పైగా నగదును అందజేస్తోంది. ఇప్పటికే నగదును బ్యాంకుల్లో జమ చేయగా సచివాలయ సిబ్బంది విత్ డ్రా చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు స్వయంగా సిబ్బంది అందజేయనున్నారు. కాగా ఆదివారం సెలవు కావడంతో శనివారం అందజేస్తారు.
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
అక్రమ ఆస్తుల కేసులో భాగంగా గురువారం నిర్వహించిన ఏసీబీ దాడుల్లో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ పీఏ గోండు మురళిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయనను అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. కేసు పూర్వాపరాలు గుర్తించిన న్యాయస్థానం ఆయనకు వచ్చే నెల 12వ తేదీ వరకు రిమాండ్ ఇస్తూ తీర్పు ప్రకటించారు. ఈ మేరకు విశాఖ జైలుకు తరలించారు.
మాజీ మంత్రి ధర్మాన మాజీ పీఏ మురళి నివాసంలో బుధవారం నుంచి ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఆ దాడుల్లో రూ. 50 కోట్లకు పైగా విలువచేసే బంగారం, వెండి, పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అరెస్ట్ చేయగా.. అతడిని మరో గంటలో విశాఖ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటించారు.
సంతబొమ్మాళి మండలంలో పులి తిరుగుతున్నట్లు ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. తాజాగా పులి అడుగులను గురువారం గుర్తించారు. సంతబొమ్మాళి మండల ప్రజలను అప్రమత్తం చేస్తూ అటవీశాఖ అధికారులు పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం రైతులు పొలాల్లో కోతలు, నూర్పులు చేస్తున్నారు. దీంతో పులి సంచారం వార్తతో భయపడుతున్నారు. పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.
సంతబొమ్మాళి మండలంలో పులి సంచారం సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందిందని అధికారులు తెలపడంతో ఆయన అధికారులతో మాట్లాడారు. అటవీ శాఖ అధికారులతో ఆయన సమాచారం ఆరా తీశారు. పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని, ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. అక్కడి ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.