India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ఉత్తరాంధ్రుల చిరకాల కోరిక తీరనుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. మరో వైపు అనకాపల్లి జిల్లాలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు వస్తున్నాయని చెప్పారు. అరకు కాఫీని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసి ఒక బ్రాండ్ తీసుకొచ్చారన్నారు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందని CM చెప్పుకొచ్చారు.
విశాఖ మహానగరంలో ప్రధాన మంత్రి హోదాలో రోడ్ షో నిర్వహించనున్న మొదటి వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవనున్నారు. గతంలో ప్రధాని హోదాలో విశాఖ వచ్చిన ఇందిరా గాంధీ, విశ్వనాథ ప్రతాప్‌సింగ్, పీవీ నరసింహారావు బహిరంగ సభలకు మాత్రమే పరిమితమయ్యారు. కాగా మోదీ తొలిసారిగా నగరంలో రోడ్ షో నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందనున్నారు. దీంతోపాటు రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వం రంగంలోనే కొనసాగించాలని 36 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టిన కార్మికులు మంగళవారం రాత్రి చలిలో శిబిరంలోనే పడుకున్నారు. బుధవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని దీక్షలో కూర్చున్నారు. 36 గంటల నిరాహార దీక్షను వీరు మంగళవారం ఉదయం కూర్మన్నపాలెంలో ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కోరారు. బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నౌకాదళానికి విశాఖ ఎయిర్ పోర్ట్‌ను అప్పగించే ప్రతిపాదన లేదని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఎయిర్ పోర్ట్‌ను నేవీకి అప్పగిస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వాణిజ్య కార్యకలాపాలను మాత్రమే నిలిపివేయడం జరుగుతుందన్నారు. విమానాశ్రయానికి సంబంధించిన ఆస్తులు ఎయిర్పోర్ట్ ఆధీనంలోనే ఉంటాయన్నారు.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 12 గంటలకు నగరానికి చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు ఐఎన్ఎస్ డేగాలో సీఎం చంద్రబాబుతో కలిసి ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం 4.45గంటలకు ప్రధాని, సీఎంతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏయూలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల పరిధిలో నేడు జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు పేర్కొన్నారు. నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కార్మికులు 1400 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో బుధవారం విశాఖ వస్తున్న ప్రధాని మోదీ నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని పలువురు ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రధాని విశాఖ రాక సందర్భాన్ని పురస్కరించుకుని గత పది రోజులు నుంచి కాంగ్రెస్, వామపక్షాలు నిరసనలు చేస్తున్నాయి. కాగా.. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కూటమి నాయకులు అంటున్నారు.
విశాఖలో ప్రధాని మోదీ సభకు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్ రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వనున్నారు. GVMC పరిధిలో వాహనాలు బయలుదేరే చోటే ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి, విజయనగరం నుంచి వచ్చేవారికి ఆ జిల్లా అధికారులు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చే వారికి నాతవలస చెక్‌పోస్టు వద్ద ఆహారం అందిస్తారు.
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనే ప్రజలు తమ వెంట కేవలం సెల్ ఫోన్ మాత్రమే తీసుకురావాలని సూచించారు. మరే ఇతర బ్యాగులు, వస్తువులు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తెచ్చినట్లయితే తమ వాహనాల్లో భద్రపరుచుకోవాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. >Share it
➤ పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ (రూ.1,85,000 Cr)
➤ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ (రూ.1,876 Cr)
➤ పాడేరు బైపాస్(రూ.244 Cr)
➤ ద.కో. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం(రూ.149 Cr)
➤ గంగవరం పోర్టు-స్టీల్ ప్లాంట్ 3,4 రైల్వే ట్రాక్ ప్రారంభం(రూ.154 Cr)
➤ దువ్వాడ-సింహాచలం(నార్త్) 3,4 ట్రాక్‌ల నిర్మాణం(రూ.302 Cr)
➤ విశాఖ-గోపాలపట్నం 3,4 ట్రాక్‌ల నిర్మాణం(రూ.159 Cr)
➤ బౌదార-VZM రోడ్డు విస్తరణ(రూ.159 Cr)
Sorry, no posts matched your criteria.