India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హెచ్ఎంపీవీ వైరస్ పై అప్రమత్తంగా ఉన్నట్లు విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయంలో కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వైరస్‌పై ఇంతవరకు ఎటువంటి ఆదేశాలు రాకపోయినా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విదేశీ ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖ వస్తున్న నేపథ్యంలో జిల్లా పరిధిలోని అన్ని స్కూల్స్‌కు నేడు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు పాఠశాలల హెచ్ఎంలకు ఈ విషయాన్ని తెలియజేయాలని డీఈఓ సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింటర్ ప్లాంట్ విభాగంలో కన్వేయర్లను పునరుద్ధరించారు. సింటర్ ప్లాంట్ విభాగంలో మూడు సింటర్ మిషన్లలో రెండు మిషన్లకు ముడిసరకు సరఫరా చేసే ఏ1, ఏ2 కన్వేయర్ల గ్యాలరీ ఈనెల మూడవ తేదీన కూలిపోయిన విషయం తెలిసిందే. దీని ద్వారా నాలుగు రోజులు పాటు హాట్ మెటల్ ఉత్పత్తి తగ్గింది. మంగళవారం ఉదయం ఏ2 కన్వెయర్, సాయంత్రం ఏ1 కన్వేయర్‌ను ప్రారంభించారు.
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో బుధవారం నిర్వహించే బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ 600 బస్సులను వినియోగిస్తుంది. విశాఖ నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సుల ద్వారా ప్రజలను తరలించనున్నారు. అలాగే దూర ప్రాంతాలకు 60 బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు ఆర్టీసీ సిటీ, మెట్రో సర్వీసులు దాదాపు నిలిచిపోనున్నాయి.
విశాఖలో ప్రధాని మోదీ పర్యటన పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విశాఖ ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. రోడ్డు, ప్రధాని సభ, గ్యాలరీ, బారికేడ్లు, పనులను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి ప్రధానిని చూడటానికి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను మరింత బాగా చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోకు ప్రచార రథాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి ఏయూ మైదానం వరకు ప్రధాని ఈ రథంపై రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా మోదీ బొమ్మ మధ్యన ఉంటూ ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది
పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మంగళవారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏయూలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రధాని పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.
విశాఖలో ప్రధాని మోదీ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి అధికారులు ప్రత్యేక మెనూ తయారు చేశారు. సభకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టు మధ్యాహ్నం పులిహోర, రాత్రికి వెజ్ బిర్యానీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు.
దేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విమ్స్ డైరెక్టర్ డా.రాంబాబు సూచించారు. సోమవారం విమ్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారికి ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిపై అనుమానాలు, భయాందోళనలు వద్దన్నారు.
పాత గాజువాక జంక్షన్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వాహనం ఇద్దరు ఫార్మా ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కిరెడ్డిపాలెంకు చెందిన రమేశ్ మరణించాడు. గాయపడిన మరో ఉద్యోగిని ఆసుపత్రిలో చేర్పించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.