India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటన ముగించుకుని గురువారం రాత్రి విజయవాడకు బయలుదేరారు. బుధవారం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులను ఆయన విశాఖలో పరామర్శించారు. అనంతరం రాంబిల్లి మండలంలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అధికారులతో సమీక్ష అనంతరం గురువారం సాయంత్రం విజయవాడకు ప్రయాణమయ్యారు.
అచ్యుతాపురం ఎస్ఈజెడ్‌లోని ఎసెన్సియా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన యల్లబిల్లి చిన్నారావు కుటుంబానికి ఎలమంచిలి టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు రూ.కోటి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కును అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామంలో బాధిత కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు.
కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ సమయంలో 4నెలల గర్భిణీ భర్తను కోల్పోయిందని తెలిసి తనకు బాధేసిందన్నారు. మరికొన్ని కుటుంబాలు ఇంటి పెద్దలను కోల్పోయారని చెప్పుకొచ్చారు. మరణించిన వారిని వెనక్కి తీసుకురాలేమని, ఆ లోటు ఎప్పటికీ ఉండిపోతుందన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని, ఇవాళే చెక్కులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు.
విశాఖ KGHలో క్షతగాత్రులు, చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత అచ్యుతాపురం సెజ్‌కు బయల్దేరారు. ఇదే సమయంలో వర్షం మొదలైంది. వానలోనే సీఎం ప్రమాదం జరిగిన ఎసెన్సియల్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చంద్రబాబుకు వివరించారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఇటీవల కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధిత విద్యార్థులు KGHలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం సెజ్ మృతుల బంధువులతో మార్చురీ వద్ద మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు విద్యార్థుల వద్దకు వెళ్లారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లోని రసాయనిక పరిశ్రమల్లో 2019 నుంచి 2024 ఆగస్టు వరకు ఎన్నో ప్రమాదాలు, పేలుళ్లు జరిగాయి. అచ్యుతాపురంలో తాజాగా జరిగిన ప్రమాదంలో సుమారు 17 మంది మృతిచెందారు. అంతకుముందు అనేక పరిశ్రమల్లో మరో 43 మందికి పైగా మృతిచెందారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
అచ్యుతాపురం ఘటన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. స్థానిక ఎయిర్‌పోర్టులో ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆయన రోడ్డు మార్గాన మెడికోవర్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ క్షతగాత్రులకు భరోసా కల్పించి నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన ఇస్తారని సమాచారం.
ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం లేదని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు. కేజీహెచ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మొత్తం 41 మంది గాయపడ్డారు. చాలా మందికి 30 నుంచి 40 శాతం గాయాలయ్యాయి. నష్టపరిహారంపై మృతుల బంధువులు తొలుత ఆందోళన చేశారు. మేము వాళ్లతో మాట్లాడాం. రూ.కోటి ఇస్తామని ప్రకటించడంతో పోస్టుమార్టానికి వాళ్లు ఒప్పుకున్నారు’ అని చెప్పారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని మోదీ సైతం స్పందించారు. మృతిచెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ ప్రకటించారు. మరోవైపు విశాఖ కలెక్టర్ మృతులకు రూ.కోటి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.1.02 కోట్లు అందనుంది.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల్లో ఎక్కువ మంది యువతరమే కావడం విషాదాన్ని నింపుతోంది. ఉపాధి కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. నైపుణ్యం లేకపోయినా ఫార్మా కంపెనీలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో యువకులు ఫార్మా పరిశ్రమలో చేరుతున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు 30 ఏళ్ల లోపు, మరో ఆరుగురు 40 ఏళ్ల లోపు వాళ్లు కాగా.. వీరిలో కొందరికి ఇంకా వివాహం కాలేదు.
Sorry, no posts matched your criteria.