India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జామ చెట్టులో గుమ్మడికాయలు కాయడం ఏంటని వింతగా చూస్తున్నారా? అవునండీ పైన కనిపిస్తున్న చిత్రం ఆదివాసీల జీవన ప్రమాణాలపై వారి ముందు చూపు, ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోయరాజులలో ఓ గిరిజన రైతు పండించిన గుమ్మడి కాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పెరటిలో ఉన్న జామ చెట్టుకి గుమ్మడి కాయలను వేలాడ దీశాడు. దీంతో అవి చెడిపోకుండా ఉంటుందట.
వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగతో పాటు కాలిన వాసన రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 1గంట సమయంలో ఖమ్మం సమీపంలోకి ట్రైన్ చేరుకునే సరికి B1 కోచ్‌లో ఫైర్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును సుమారు 45min నిలిపి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా కైలాసగిరి రిజర్వు పోలీస్ మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.
అచ్యుతాపురం మండలం పూడిమడకలో రెండు రోజుల పాటు నిర్వహించిన బీచ్ హ్యాండ్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా విశాఖ జట్టు నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జట్టు, మూడవ స్థానంలో ప్రకాశం జట్టు నిలిచాయి. విజేతలకు బహుమతులను జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ సుందరపు సతీశ్ కుమార్ అందజేశారు. ఈ పోటీలు విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విశాఖ ఇన్ ఛార్జ్ మంత్రి వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం విశాఖలోని శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. నేలపై కూర్చొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నెల 8న విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం చేయాలని మంత్రి లోకేశ్ నాయకులు, అధికారులకు ఆదేశించారు. ప్రధాని రోడ్ షోలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. రోడ్ షో బాధ్యతలను ఎమ్మెల్యే గణబాబుకు అప్పగించారు. బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చూసుకోవాలన్నారు. గణబాబు, పల్లాకు అందరూ నేతలు సంపూర్ణ సహకారం అందించాలని లోకేశ్ సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకడంతో పాటు ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు. మంత్రులు నారా లోకేశ్, అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి విశాఖలోనే మకాం వేశారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఏయూ దూరవిద్య డిగ్రీ కోర్సుల పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఫిబ్రవరి 12 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 6 నుంచి వెబ్సైట్లో పరీక్షల టైమ్ టేబుల్ అందుబాటులో ఉంటుందన్నారు. వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయని అన్నారు.
విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రజా ప్రతినిధులు పాల్గొని హెలికాప్టర్లు ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయలు, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, అనకాపల్లి MP సీఎం రమేశ్, నగర మేయర్ హరి వెంకటకుమారి, MLA వంశీకృష్ణ శ్రీనివాస్, గొల్ల బాబురావు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నలుగురు ఏ.ఎస్.ఐలను ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఏఎస్ఐలుగా పనిచేస్తున్న టి.అర్జునరావు, ఎస్.శేషగిరిరావు, ఎస్.సన్యాసిరావులను అనకాపల్లి జిల్లాకు, జె.శంకరరావును అల్లూరి సీతారామరాజు జిల్లాకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.