Visakhapatnam

News February 20, 2025

విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

విశాఖ నుంచి తిరుపతికి వీక్లీ స్పెషల్ (08583/84)ప్రత్యేక రైళ్లను వేయడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి సోమవారం వీక్లీ ట్రైన్ ఉంటుందన్నారు. సోమవారం రాత్రి 7గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. తిరిగి మరుసటి రోజు తిరుపతి నుంచి విశాఖ బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలన్నారు.

News February 19, 2025

విశాఖపట్నం టుడే టాప్ న్యూస్

image

☞ పెందుర్తి నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ☞మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ☞కాపులుప్పాడ వద్ద అస్తిపంజరం కలకలం ☞ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ ☞విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్ ☞మధురవాడలో ఉరేసుకుని మహిళ మృతి ☞నేటి నుంచే పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ జాతర ☞దువ్వాడలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెండ్

News February 19, 2025

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్య‌త‌కు పెద్ద‌పీట వేయాలి: జిల్లా కలెక్టర్

image

ఎన్.టి.ఆర్. కాల‌నీల్లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్య‌త విష‌యంలో రాజీప‌డ‌కుండా ప‌నుల‌ను వేగ‌వంతంగా చేయాల‌ని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. బుధ‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగ‌తి, ఇసుక స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న తదిత‌ర అంశాల‌పై ఆయన స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.

News February 19, 2025

మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.

News February 19, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ

image

కష్టకాలంలో నిలబడ్డవారికి సపోర్ట్ చేయాలని విశాఖ MP శ్రీభరత్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆదేశానుసారం ప్రస్తుత MLC రఘువర్మకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన కూడా మద్దతు తెలిపిందని బీజేపీతో చర్చిస్తామని వెల్లడించారు. కాగా.. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సమయంలో TDP బలపరిచిన వేపాడ చింరజీవి గెలుపులో రఘువర్మ కీలక పాత్ర పోషించారు.

News February 19, 2025

విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్

image

నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News February 19, 2025

వైస్ ఛాన్స్‌లర్లుగా ఏయూ ఆచార్యులు 

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నూతన ఉప కులపతులుగా నియమితులయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగ సీనియర్ ఆచార్యులు ఏ.ప్రసన్నశ్రీ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఏయూలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమింపబడ్డారు.

News February 19, 2025

బ‌హుళ పంట‌ల విధానంపై రైతుల్లో చైత‌న్యం: కలెక్టర్

image

లాభ‌దాయ‌క సాగు విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి సేద్యానికి, మిల్లెట్లు, బ‌హుళ పంట‌ల సాగుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. గ్రామాలల్లో ప్ర‌తి ఇంటి వ‌ద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంప‌కం చేసేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.

News February 18, 2025

విశాఖ: టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

image

టెన్త్ క్లాస్ చదువుతున్న కే.సాస మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్. జి.జి..ఓఎస్.కాలనీ ఓ అపార్ట్మెంట్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. బాలిక సీతమ్మధారలోని ఓ స్కూల్‌లో చదువుతుంది. ఏమైందో తెలియదు గానీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News February 18, 2025

బ‌హుళ పంట‌ల విధానంపై రైతుల్లో చైత‌న్యం తీసుకురావాలి: కలెక్టర్

image

లాభ‌దాయ‌క సాగు విధానాల‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని వ్య‌వ‌సాయ అనుబంధ శాఖ‌ల‌ అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి సేద్యానికి, మిల్లెట్లు, బ‌హుళ పంట‌ల సాగుకు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. గ్రామాలల్లో ప్ర‌తి ఇంటి వ‌ద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంప‌కం చేసేలా అవ‌గాహ‌న కల్పించాలన్నారు.