India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖ కైలాసగిరి వద్ద పోలీస్ మైదానంలో గురువారం ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని పర్యవేక్షించారు. 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు, ఛాతీ పరీక్షలు నిర్వహించారు. 600 మంది అభ్యర్థులకు గాను 228 మంది హజరయ్యారని ఎస్పీ తెలిపారు.
అల్లూరి జిల్లా పెదకోట పంచాయతీ కేంద్రం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో చటకంభ ఉంది. గ్రామంలో 240 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఆ గ్రామం మీదుగా 30 గ్రామాలున్నాయి. 15 సంవత్సరాలు క్రితం వేసిన మట్టిరోడ్డు ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా కొట్టుకుపోయింది. దీంతో తారురోడ్డు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అల్లూరి జిల్లా కలెక్టర్‌ను ఆ గ్రామస్థులు విన్నవించుకున్నారు.
విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఆమెను ఎంపీ భరత్ సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విశాఖ నుంచి అర్జున అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఆమె పట్టుదల అంకితభావాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆమెను ఆయన అభినందించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 10న సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 5 గంటల నుంచి పదిన్నర వరకు ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం ఈఓ త్రినాధరావు తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెందుర్తి మండలం పురుషోత్త పురం గ్రామంలో ఆర్థిక బాధలు తాళలేక భార్యాభర్తలు ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి. మృతులు భర్త సంతోష్ (35), భార్య సంతోష్ శ్రీ (25)గా పెందుర్తి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (ఇగ్నో) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విశాఖ ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ జి.ధర్మారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పీజీ, డిప్లమో సర్టిఫికెట్ కోర్సుల్లో పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు ఎంవీపీ కాలనీలో ఇగ్నో కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విశాఖ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయవచ్చు. మరిన్ని వివరాలకు htts://nagendrasvst.wordpress.com వెబ్ సైట్‌లో చూడొచ్చు. >Share it
గాజువాకలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటుండగా క్రాకర్స్ బ్లాస్ట్ కావడంతో ఒకరు మృతి చెందారు. వడ్లపూడి రజకవీధిలో అర్ధరాత్రి 12.05 సమయంలో సుద్దమళ్ల శివ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసే సమయంలో క్రాకర్స్ బ్లాస్ట్ కావడంతో అతని నుదిటికి గాయమైంది. చికిత్స కొసం కోసం తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ మాజీ MP ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో కీలక ముద్దాయి కోలా హేమంత్ కుమార్ కదలికలపై జైలు అధికారులు నిఘా పెట్టారు. ఈ మేరకు సెంట్రల్ జైలులో అతని వద్ద 3సెల్ ఫోన్లు గుర్తించినట్లు తెలుస్తోంది. జైల్లో వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఫోన్లు బయటపడటం చర్చనీయాంశమైంది. ఎవరు లోపలికి తీసుకొచ్చారు, ఎన్ని రోజులుగా వాడుతున్నారనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Sorry, no posts matched your criteria.