India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జీవీఎంసీ పరిధిలో చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గుడ్‌న్యూస్ చెప్పారు. పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చినట్లు ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 31వ తేదీ లోగా బకాయిలు చెల్లించి ఈ లబ్ధి పొందాలని సూచించారు.

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆదివారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన IPL మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంకు చేరుకుంటారు. మ్యాచ్ అనంతరం రామ్‌నగర్‌లో గల ఎన్టీఆర్ భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. వీటికి తగ్గట్టు పార్టీ వర్గాలు ఏర్పాటు చేస్తున్నారు.

విశాఖ శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పి అప్పారావు (82) ఆరిలోవ సెక్టార్- 2 డ్రైవర్స్ కాలనీలో నివసిస్తున్నాడు. తరచూ తన భార్యను తిట్టడం, కుమారుడు మీద పరుషపదజాలం వాడటం వంటివి చేస్తుంటాడు. కాగా శనివారం తన తల్లిని తండ్రి అప్పారావు కొట్టడంతో కోపోద్రిక్తుడైన కుమారుడు బాలయోగి బ్లేడుతో దాడి చేశాడు. దీంతో అప్పారావు చనిపోయారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యువెలర్స్ షాప్‌లో ఉత్తర భారత దేశానికి చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి చూపించి బంగారు డైమండ్ రింగ్, మరొక షాప్‌లో వెండి చెంబుతో ఉడాయించినట్లు యజమానులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారక పోలీసులు సీసీ టీవీ ద్వారా దర్యాప్తు చేసి శనివారం నలుగురు మహిళలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, వెండిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరిలించారు.

GVMC బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం కార్పొరేటర్లకు రూ. 25వేల విలువైన గిఫ్టు కూపన్లను అందజేశారు. GVMC లో సభ్యులైన MLA, MLC, MP లకు గిఫ్టు కూపన్లు అందించినట్లు సీపీఐ నాయకులు తెలిపారు. వీటి కోసం సుమారు రూ.30 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. సీపీఐ కార్పొరేటర్ స్టాలిన్, సీపీఎం కార్పొరేటర్ గంగారావు వీటిని తిరస్కరించారు. ప్రజల సొమ్మును గిఫ్టులుగా ఖర్చు చేయడం సరైనది కాదని వారు ఆరోపించారు.

విశాఖ నగర పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన 9 మంది పోలీస్ సిబ్బంది శనివారం పదవీ విరమణ చేశారు. వారికి విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి వీడ్కోలు పలికారు. పోలీస్ శాఖలో 40 ఏళ్ళకు పైగా సర్వీస్ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రిటైర్మెంట్ జీవితం హాయిగా గడపాలని కోరారు. రిటైర్డ్ అయిన వారిలో ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెచ్‌సి, ఎఆర్‌హెచ్‌సీ, పీసీలు ఉన్నారు.

విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ భరత్ పాల్గొని ఎన్‌టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 43 ఏళ్లుగా నిర్విరామంగా ప్రజల కష్టాలను తీరుస్తూ, దేశ రాజకీయ చరిత్రలోనే టీడీపీ ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే లు గంటా శ్రీనివాస్‌రావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గండి బాబ్జి ఉన్నారు.

విశాఖ పీఎంపాలెం ఏసీఏ-వీసీడిఏలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనట్లు శనివారం నిర్వాహకులు తెలిపారు. ఆదివారం కావడంతో అధికసంఖ్యలో ప్రేక్షకులు వస్తారన్న అభిప్రాయంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రేపు ఢిల్లీ కాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ టికెట్ల కట్టడికి పోలీసులు నిఘా ఉంచినట్లు తెలిపారు.

గాజువాకలో తెల్లవారుజామున యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన వసంతుల సతీశ్ కుమార్ అనే యువకుడు విశాఖలోని ఓ ఫార్మా ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి చైతన్య నగర్‌లోని రూములో స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి పడుకున్నాడు. తెల్లవారుజామున ఫ్యాన్ ఆగిపోవడంతో రాజశేఖర్ లేచి చూసేసరికి సతీశ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు.

యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా యువకుడు పెళ్లికి నిరాకరించడంతో కేసు నమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.