India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో ఆదివారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు పాత పోస్ట్ ఆఫీస్, సింహాచలం, గాజువాక, కూర్మన్నపాలెం, వివిధ ప్రాంతాల నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్ధీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు.

విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు 6 నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అప్రమత్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని, మెట్రో ప్రాజెక్టు, మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించారు.

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలని, ఉమెన్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉగాది వేడుకలను సంప్రదాయబద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుకల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 30న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా నిర్వహించాలన్నారు. వేడుకలు అన్ని శాఖల సమన్వయంతో జరగాలన్నారు.

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

విశాఖ జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ.23,870.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ రూపొందించినట్లు నాబార్డ్ డెవలప్‌మెంట్ మేనేజర్ బసంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్‌లో నాబార్డ్ 2025-26 ‘పోటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్’ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ విడుదల చేశారు. ఈ ప్రణాళిక ముఖ్యంగా MSMEలు, పునరుత్పాదక ఇంధనం, ఎగుమతి క్రెడిట్ సుస్థిర వ్యవసాయంపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.

గాజువాక వడ్లపూడి అప్పికొండ కాలనీలోని ఓ ఇంట్లో బాలికతో పాటు మరో వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. మర్రిపాలెంకి చెందిన అమీరుద్దిన్ ఖాన్(36) సింహాచలంలో బాలిక(17) తల్లి నిర్వహిస్తున్న హోటల్లో పని చేసేవాడు. అతని వైఖరి నచ్చగా బాలిక తల్లి పని నుంచి తొలగించింది. కాగా శుక్రవారం అమీరుద్దీన్ రూమ్‌లో బాలిక, అమీరుద్దిన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అన్నయ్య మందలించాడని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. జై భారత్ నగర్‌లో ప్రతాప్ అనే యువకుడు ఉంటున్నాడు. ప్రతాప్ శుక్రవారం డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన అన్నయ్య మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పారిశ్రామికవేత్తలతో విశాఖ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ & ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ పలు అంశాలను పారిశ్రామికవేత్తలు, అధికారులతో చర్చించారు. ఇరువురి సమన్వయంతో పరిశ్రమలు అభివృద్ధి చెందాలని అయన కోరారు.

విశాఖలో మేయర్ సీటుపై హీట్ రేగుతోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మాన వ్యవహారంపై వైసీపీ తామే నెగ్గుతామని ధీమా వ్యక్తం చేస్తుండగా పూర్తిస్థాయిలో బలం మాకే ఉందని కూటమి నాయకులు చెబుతున్నారు. మొత్తం 112 ఓట్లు ఉండగా 75 ఓట్లు అవిశ్వాసానికి వ్యతిరేకంగా నమోదు కావాలి. కూటమికి 64 మంది కార్పొరేటర్లు. 11 మంది ఎక్స్ అఫీషియ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా వైసీపీ, కూటమి ఎవరి ధీమా వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.