India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన షేక్ ముధఫర్, మహమ్మద్ చాంద్, షేక్ అనీష్ విశాలాక్షి నగర్‌లో <<15460513>>బ్రౌన్ షుగర్ <<>>అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే టాస్క్ ఫోర్స్, ఆరిలోవ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో సమాధానం చెప్పాలన్నారు. సమస్యలను నిర్ణీత గడువులో పరిస్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువల అన్యాక్రాంతాన్ని అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు.
బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కేజీహెచ్ ఉన్నతాధికారులకు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కేజీహెచ్‌లో అధికారులతో సమావేశమయ్యారు. 2024లో ఎంతమంది పిల్లలు జన్మించారు.. ఎంతమంది మరణించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిడ్డ పుట్టిన గది వద్దకు తప్పులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.
మల్కాపురంలోని ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన వివాదంలో కత్తిపోట్లకు గురైన శామ్యూల్ KGHలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మల్కాపురం ఆటో స్టాండ్ వద్ద అప్పలరెడ్డికి శామ్యూల్ మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో అప్పలరెడ్డి తన వద్ద ఉన్న <<15456247>>కత్తితో శామ్యూల్‌ని <<>>పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. KGHలో చేర్పించి ఆపరేషన్ చేసినప్పటికీ శామ్యూల్ మృతి చెందాడు. కాగా..నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకుల తోడ్పాటు, రుణాల మంజూరు ప్రక్రియ, తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.
పాత గాజువాక జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నేవీ అధికారుల క్వార్టర్స్‌లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ క్వార్టర్స్‌లో కమల అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా ఓ అధికారి ఇంట్లో పని చేస్తుంది. వారు పని మీద బయటకు వెళ్లారు. మూడు రోజులుగా ఆమె ఇంట్లోనే ఉంటోంది. గురువారం పక్క ఫ్లాట్ వాళ్లు కిటికీలోంచి చూడగా ఆమె బట్టలు లేకుండా కింద పడి ఉంది. దీంతో సెక్యురిటీకి సమాచారం అందించారు. మల్కాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం విశాఖ రానున్నారు. ఈరోజు సాయంత్రం 6:40కు విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయలుదేరి నగరంలో గల టీడీపీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ముఖ్య నాయకులతో సమావేశమై రాత్రి టీడీపీ కార్యాలయంలో బస చేస్తారు. శనివారం భోగపురంలో గల ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొని శనివారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని విజయవాడ వెళ్తారు.
మల్కాపురంలోని ఆటో స్టాండ్ వద్ద ఇద్దరు డ్రైవర్ల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఒకరిపై మరొకరు కత్తితో దాడి చేసుకున్నారు. దీంతో శామ్యూల్ తీవ్రంగా గాయపడగా కేజీహెచ్‌కు తరలించారు. కత్తితో పొడిచిన అప్పన్న రెడ్డిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మద్యం మత్తులో ఘర్షణకు దిగారని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.