India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి తన క్యాంపు కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు పార్టీ నాయకుల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహానీయులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు.
విశాఖ నగరానికి చెందిన ఓ వివాహితను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఒడిశాకు చెందిన శక్యాస్మిత్ రౌత్ అనే యువకుడిని సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వివాహితను మాయమాటలతో శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆ సమయంలో చేసిన వీడియోలను కుటుంబ సభ్యులకు పంపించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీనిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది.
వెయిటింగ్ లిస్ట్ జాబితాను తగ్గించేందుకు గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కే సందీప్ తెలిపారు. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్‌కు ఈనెల 14 నుంచి 19వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్‌కు ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు రెండు థర్డ్ ఏసి ఎకానమీ కోచ్‌లను జత చేస్తున్నామన్నారు.
ఉల్లి ధరలు మళ్ళీ పెరిగాయి. బుధవారం విశాఖ నగరంలో బహిరంగ మార్కెట్లో కిలో రూ.60కి విక్రయించారు. రైతు బజార్లలో 42 రూపాయల చొప్పున విక్రయాలు జరిపారు. దీంతో రైతుబజార్ల ఉల్లి కౌంటర్ల వద్ద క్యూలు కనిపించాయి. విశాఖ నగరానికి రోజు సుమారు 12 లారీల ఉల్లి అవసరం కాగా.. అందుకు తగ్గ స్థాయిలో రాకపోవడంతో రేట్లు పెరిగినట్లు వ్యాపారాలు తెలిపారు.
రాష్ట్రంలో రూ.300 కోట్లతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని వేశారు. వీరు రుషికొండ భవనంపై అధ్యయనం చేయడంతో పాటు విశాఖ, SKLM, VZM జిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించనున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగే విధంగా సూచనలిస్తారు. మరి మీ దగ్గర పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతం ఏదైనా ఉంటే కామెంట్ చెయ్యండి
విశాఖపట్నం ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది. దీంతో ఉపాధ్యాయ ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సెప్టెంబర్ 30న నోటీసు జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి తుది ఓటర్ల జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఇందులో పాడేరు జేసీ అభిషేక్ పాల్గొన్నారు.
ఆగస్టు 15న పలు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లు తెరచుకోనున్నాయి. కానీ విశాఖ జిల్లాలో మాత్రం పేదలకు రూ.5 కు భోజనం ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. దీనికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలే కారణం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో విశాఖ జిల్లాలో అన్న క్యాంటీన్ల పున:ప్రారంభం వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.
వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలో పూండి-నౌపడా సెక్షన్‌లో భద్రతాపరమైన ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా విశాఖ బ్రహ్మపుర రైలు గమ్యాన్ని కుదించినట్లు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. విశాఖ బ్రహ్మపుర రైలు ఈనెల 18వ తేదీన శ్రీకాకుళం రోడ్డు వరకే నడుస్తుందని పేర్కొన్నారు. ఈనెల 19న తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర విశాఖ రైలు బ్రహ్మపురకు బదులు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుందన్నారు.
విశాఖ స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలలో బొత్సను వైసీపీ అధిష్ఠానం బరిలో దింపింది. అయితే కూటమి నుంచి ఎవరూ పోటీలోలేరని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బొత్స విజయం ఖాయం కానుంది. దీనికి స్పందిస్తూ మాజీ మంత్రి అంబటి ” YSRCP పూర్వ వైభవానికి బీజం వేసిన బొత్స విజయం ” అంటూ తన X లో పేర్కొన్నారు. ఇది నిరుత్సాహంలో ఉన్న వైసీపీకి ఊరటనిచ్చే విషయమేనని పలువురు చర్చించుకుంటున్నారు.
విశాఖ బీచ్ రోడ్డులోని డైనో పార్క్‌లో నిన్న ఉదయం భారీ <<13841865>>అగ్నిప్రమాదం <<>>జరిగిన విషయం తెలిసిందే. జంతువుల నమూనాలు, వివిధ క్రీడా సామగ్రి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో దాదాపు రూ.60 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఉదయం కావడంతో పార్కులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Sorry, no posts matched your criteria.