India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలోని అక్కయ్యపాలెంలో బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు(13) అమ్మమ్మ వద్ద ఉంటూ నగరంలోని ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఇంటిలో ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువగా ఆడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం బాత్రూంలో షూ లేసులతో హ్యాంగర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ఎంపికైన విద్యార్థులు వచ్చే నెల 3 నుంచి 5వ తేదీ వరకు కర్నూలులో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అన్నారు. పోటీలు గాజువాక జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతాయన్నారు.
విశాఖలోని సీతంపేట CSB బ్యాంకుకు తమరాన చిరంజీవి అనే వ్యక్తి బురిడీ కొట్టించాడు. CSB బ్యాంకుకి వెళ్లి సుజాతనగర్ FEDERAL బ్యాంకులో గోల్డ్ తాకట్టు ఉందని.. అది విడిపించి మీ బ్యాంక్‌లో పెడతానని రూ.14,69,000 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఆ డబ్బులతో వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటనపై ద్వారకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.
2014లో పెదబయలు మండలంలోని కుంతుర్ల గ్రామానికి చెందిన మజ్జి బాలరాజు అనే వ్యక్తి, అడవి పందుల కోసం వేసిన విద్యుత్ ఉచ్చులో పడి మృతి చెందాడని ఎస్సై కే.రమణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారన్నారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిలో ఏ-2 ముద్దాయి అయిన గంపదొర సత్తిబాబు అనే వ్యక్తికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పినట్లు ఎస్సై సోమవారం తెలిపారు.
సంక్రాంతి సీజన్ సందర్భంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 19 వరకు ప్రతి శని, ఆదివారాల్లో విశాఖ నుంచి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈ రైలు వైజాగ్ నుంచి ఉదయం 8:30 గంటలకు బయలుదేరి అరకు 11.45 గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఇవే తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు.అరకులో మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరతాయని తెలిపారు.
నర్సీపట్నం ఆర్టీసీ హైర్ బస్సు దొంగతనంలో నిందితుడు సాదిక్ భాషా అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లాకు చెందిన భాషా గతంలో వోల్వో, లారీలకు డ్రైవర్‌గా పనిచేశాడు. ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి వచ్చి మద్యం మత్తులో బస్సులో పడుకున్న తర్వాత బస్సుకు తాళం ఉండటం గమనించి దొంగతనం చేశాడని తెలిపారు.
విశాఖలో సోమవారం నిర్వహించిన రోజ్‌గర్‌మేళాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోస్టల్, రైల్వే, బ్యాంకింగ్ మరిన్ని రంగాల్లో ప్రభుత్వ సేవలకు ఎంపికైన 664 మందికి కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేసి, వారందరికీ అభినందనలు తెలిపారు. దేశం గర్వించేలా పని చేయాలనీ కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారు.
ఉపాధి హామీ పథకం, అమృత్ పథకం, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన తదితర అభివృద్ధి పథకాలపై జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ 20 సూత్రాల ఛైర్మన్ ఎల్.దినకర్ తెలిపారు. సోమవారం విశాఖ బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సమీక్ష సమావేశాల అనంతరం నివేదికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ పాల్గొన్నారు.
విశాఖ కేజీహెచ్‌లో సర్వర్లు పని చేయక రోగులు కష్టాలు పడుతున్నారు. తెల్లవారి నుంచి ఓపి కౌంటర్ దగ్గర గంటల తరబడి లైన్‌లో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్లకే సమయం అయిపోతుందని రోగులు ఆందోళన చెందుతున్నారు. ఓపి కౌంటర్ వద్ద ప్రతిరోజు రోగులకు కష్టాలు తప్పడం లేదని.. ప్రత్యమ్నాయం చేపట్టాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
భీమిలి మండలం తిమ్మాపురం సముద్ర తీర ప్రాంతానికి రెండు తాబేళ్ల కళేబరాలు ఆదివారం కొట్టుకొచ్చాయి. రెండు రోజులుగా భీమిలి, ఉప్పాడ, మంగమూరిపేట తదితర తీర ప్రాంతాలకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఈ సీజన్‌లో గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయని వారు వెల్లడించారు. కాలుష్యం కారణంగా ఇవి మృత్యువాత పడుతున్నట్లు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.