India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనధికార శిశు విక్రయాలపై లోతైన విచారణ జరిపి నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు నేతృత్వంలో విశాఖ నగర పోలీసు కమిషనర్‌కు సోమవారం ఆదేశించినట్లు కమిషన్ సభ్యులు సీతారాం తెలిపారు. సోమవారం కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో ప్రత్యేకంగా దృష్టి సారించి మూలాలను శోధించాలని సూచించింది. అనధికార దత్తత స్వీకారాలపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరింది.
ఏయూ లో ఎంబీఏ, ఎంసీఏ ఫుల్ టైం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు వెంటనే నిర్ణీత ఫీజును చెల్లించాలి.
పార్టీ ముఖ్యనేతలతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విశాఖ నగరం తన నివాసంలో భేటీ అయ్యారు. మారుతున్న రాజకీయ పరిణామాలపై వారితో అభ్యర్థి చర్చించారు. కూటమి తరపున ఎవరు పోటీలో ఉన్న వైసీపీ విజయం ఖాయమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, మేయర్ హరి వెంకటకుమారి, మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఉన్నారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న సుప్రభాత ఆరాధన టికెట్లు ఈనెల 14న నిలుపుదల చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీన కొండపై వెలసిన శ్రీఉమా మహేశ్వరి పాదాలమ్మ, బంగారమ్మ పండుగ జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు తొలేళ్ళ ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాందేడ్ వయా దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డుకు ఈనెల 14న ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఇది మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుందన్నారు. 15న శ్రీకాకుళం రోడ్లో ఈ ట్రైన్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా మరుసటి రోజు నాందేడ్ చేరుకుంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టికెట్‌ను దిలీప్ ఆశించారు. ఆయనకే టికెట్ వస్తుందని అందరూ అనుకున్నా.. రాజకీయ సమీకరణాల్లో భాగంగా పోటీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిలీప్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.
విశాఖలో శిశువులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. త్రీటౌన్ పోలీసుల కథనం..స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ప్లాన్‌తో ముఠా సభ్యులతో మాట్లాడి శిశువు కావాలని కోరారు. రూ.7 లక్షలకు ఒప్పించి శనివారం రాత్రి సిరిపురం జంక్షన్‌కు 8 మంది 5నెలల చిన్నారిని తీసుకొచ్చారు. వారిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బిడ్డను పోషించలేక అమ్ముకున్నట్లు తల్లి చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కూటమి MLCఅభ్యర్థిపై తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ అమరావతికి రానున్నారు. ఈ క్రమంలో ఆయన అభ్యర్థిని ఫైనల్ చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జి, బైరా దిలీప్ చక్రవర్తి, సీతంరాజు సుధాకర్ పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, YCP అభ్యర్థి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయనున్నారు.
అల్లూరి జిల్లా ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే గంజాయి రవాణాపై ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో అన్ని స్టేషన్ల పరిధిలో తనిఖీలు విస్తృతం చేశారు. పాడేరు ఎస్ఐ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో డాగ్ స్క్వాడ్ బృందం ఘాట్ మార్గంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే పెదబయలు మండలం రూడ గోమంగి పరిసరాల్లో కూంబింగ్ విస్తృతం చేశారు. హుకుంపేట, చింతపల్లి మండల కేంద్రంలో వచ్చే వాహనాలన్నీ తనిఖీలు చేస్తున్నారు.
విశాఖ నగర పరిధిలో ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేయాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను చేతబట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతటా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.