India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతగిరి మండలం బల్లగరువులో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం Dy.CM పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలని సూచించగా.. ‘మా ఇంట్లో వాళ్లు నా కోసం ఎంత తపన పడతారో తెలీదు కానీ.. మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది’ అని అన్నారు. ఐదేళ్లు మీకోసం పని చేస్తానని.. ఈ ఐదేళ్ల తర్వాత ప్రోగ్రస్ రిపోర్ట్ ఇవ్వాలని గిరిజనులకు ఆయన కోరారు.
విశాఖలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకటకుమారి, రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఉన్నారు.
వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని అన్ని స్కూళ్లకు శనివారం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ స్కూళ్లను ఓపెన్ చేశారని కొందరు అంటున్నారు. అనకాపల్లి జిల్లాకు ఈ సెలవు వర్తించదు. ఇంతకూ మీ ఏరియాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారా? లేదా?
కాఫీ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా జీసీసీ కాఫీ మద్దతు ధరను పెంచిందని జీసీసీ ఛైర్మెన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జీసీసీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. కాఫీ పార్చ్మెంట్‌కు ఇస్తున్న రూ.285 ధరను రూ.320కు, చెర్రీకి ప్రస్తుతం ఇస్తున్న రూ.150లను రూ.170కు పెంచినట్లు పేర్కొన్నారు. అలాగే రొబస్టా కాఫీకి ఇస్తున్న రూ.80 లను రూ.100 లకు పెంచామన్నారు.
పరిటాల రవి హత్య కేసులో ముద్దాయి రేఖమయ్య విడుదలైనట్లు సెంట్రల్ జైల్ అధికారి కె.కుమార్ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో 2013 సంవత్సరం నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రేఖమయ్యకు హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో శుక్రవారం సాయంత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు. పదేళ్ల అనంతరం బాహ్య ప్రపంచంలోకి రేఖమయ్య అడుగుపెట్టాడు.
మధ్యవర్తిత్వం విధానం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. విశాఖ నగరం న్యాయస్థానాల భవన సముదాయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కక్షిదారులు న్యాయవాదులు న్యాయమూర్తులు కలిసి మధ్యవర్తిత్వం ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించాలని సూచించారు.
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఇటీవల ఎదురు కాల్పులు, గాలింపు చర్యలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఏపీలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి హెచ్చరించారు. అల్లూరి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మావోయిస్టులతో కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా రవాణ శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌ను శుక్రవారం సందర్శించారు. ప్రయాణీకులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని పలు దుకాణాలు, హోటల్ నిర్వాహకులకు సూచించారు. అనంతరం మంత్రి ఓ హోటల్లో అల్పాహారం తిని, టీ తాగారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు.
అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పెదబూరులో పవన్ కళ్యాణ్ శనివారం పర్యటించి రూ.16.67 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణం పనులకు భూమి పూజ చేస్తారు. కాగా ఉప ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మీదుగా అల్లూరి జిల్లా పెదబూరుగు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి ఆనంద్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ డెయిరీకి సంబంధించిన 12 మంది డైరెక్టర్లు సహా తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు లేఖ రాశారు. కాగా.. గత ఎన్నికల్లో ఆడారి ఆనంద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.
Sorry, no posts matched your criteria.