India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ప్రసాద్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రజలు 0891-2590102కు ఫోన్ చేయాలని సూచించారు.
ఎక్కువ వడ్డీలకు ఆశ పడిన ప్రజలు మోసపోయిన ఘటన విశాఖ నగరంలో జరిగింది. విశాఖ 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారి వీధికి చెందిన మజ్జి ముత్యాలు సొంత ఇంట్లో భర్త, పిల్లలతో నివసిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి రెండేళ్లుగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.4 కోట్లు వసూలు చేసింది. భర్త, పిల్లలను వదిలి మరో వ్యక్తితో పరారైనట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాఫీ పళ్ళను దళారులకు విక్రయించి మోసపోవద్దని పాడేరు ఐటిడిఏ పీవో వి.అభిషేక్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధి గాదిగొయ్యి గ్రామంలో ఉన్న కాఫీ తోటాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ..పూర్తిగా పండిన కాఫీ పళ్ళు మాత్రమే సేకరించాలన్నారు. నాణ్యమైన పళ్ళు సేకరించడం వల్ల మంచి ధరలు వస్తాయన్నారు. దళారులు తూనికల్లో మోసం చేస్తారని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అక్కిరెడ్డిపాలెం విశాఖ డెయిరీ గెట్ వద్ద మహిళా కార్మికులు వర్షంలో సైతం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బుధవారం రాత్రి పాల సరఫరాను అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చి న్యాయం చేసే వరకు పాల సరఫరాను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. కాగా యాజమాన్యం స్పందించి వారితో మాట్లాడటంతో తాత్కాలికంగా నిరసనను విరమించారు.
చదువుకోవడానికి కెనడా వెళ్లిన గాజువాక యువకుడు అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగప్రసాద్ కుమారుడు ఫణికుమార్ 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళారు. శనివారం తన రూమ్మేట్ ఫణి కుమార్ చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో వారు ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకున్నారు. కాగా ఫణి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదువుకోవడానికి కెనడా వెళ్లిన గాజువాక యువకుడు అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగప్రసాద్ కుమారుడు ఫణికుమార్ 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళారు. శనివారం తన రూమ్మేట్ ఫణి కుమార్ చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో వారు ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకున్నారు. కాగా ఫణి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాకవరపాలెం మండలం కె.తూటిపాలలో వివాహిత కొల్లి విజయ(25) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
విశాఖలో బుధవారం ఐన్ఎన్ఎస్ నిర్దేశిక్ నౌకను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను నౌకాదళ అధికారులు చేశారు. కోల్‌కతాలో ఐఎన్ఎస్ నిర్దేశిక్ నౌక నిర్మాణం జరిగింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువైన దీనిని రెండు ఇంజన్లతో రూపకల్పన చేశారు. మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరగనుంది.
జాయ్ జమీమియా (హనీ ట్రాప్) కేసులో మాజీ ఎంపీ కుమారుడు పాత్ర ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. కమిషనరేట్లో ఆయన మంగళవారం మాట్లాడుతూ.. జామ్ జమీమియా ముఠాలో మాజీ ఎంపీ కుమారుడు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. దీనిపై కూడా తాము విచారణ చేస్తున్నామన్నారు. పోలీసులకు దొరికితే ఏ విధంగా సమాధానాలు చెప్పాలో ముందుగానే ముఠా సభ్యులు శిక్షణ పొందినట్లు తెలిపారు.
జీకే వీధి మండలం ఆర్వీ నగర్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి. గోవర్ధన్ మంగళవారం తీర్పు ఇచ్చారు. 2017 ఏప్రిల్ 19న ఆర్.వీ నగర్ జంక్షన్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. అనంతరం లారీ డ్రైవర్ భయంతో కిందికి దూకడంతో లారీ ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.