India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్‌కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.
విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో రమణయ్య గతేడాది ఫిబ్రవరి 2న విశాఖలో హత్యకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సతీమణి అనూషకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కారుణ్య నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. హత్యకు గురైన సమయంలో మంత్రికి అనూష విన్నపం చేశారు. అప్పట్లో మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా నియామక పత్రం అందించారు.
లీలా వరప్రసాద్ ఇద్దరు స్నేహితులతో సోమవారం రాత్రి టిఫిన్ కోసం వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. ఓ కాలేజీ సమీపంలో వారిని భయపెట్టి, కొట్టి రూ.1,000 లాక్కున్నారు. మరో రూ.5,000 తీసుకురమ్మని ముగ్గురు స్నేహితుల్లో ఒకరిని పంపించి బెదిరించారు. భీమిలి పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. దేవాలయ కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సున్నం, అరబిక్ చెట్ల జిగురు, బెల్లం, జనపనార మిశ్రమాన్ని వాడి లీకేజీలు నివారిస్తామన్నారు.
కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DMHO జగదీశ్వరరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.
షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.
విశాఖలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు.మంగళవారం ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు.విశాఖలో 134 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 28,523, ఓపెన్ విద్యార్థులు 1,404 మొత్తం 29,997 మంది హాజరవుతున్నారని డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు.
పదో తరగతి అర్హతతో ఇండియన్ పోస్టల్‌శాఖలో ఉద్యోగాలకు <<15428846>>నోటిఫికేషన్ <<>>వచ్చింది. విశాఖ డివిజన్ పరిధిలో 9 ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టుల వివరాలు ఇవే..
➤ అనంతవరం(GDS ABPM)-ఓపెన్
➤ ఆరిలోవ(GDS ABPM)-EWS
➤ గాజువాక(DAKSEVAK)-ఓపెన్
➤ H.B కాలనీ(GDS ABPM)-ఓపెన్
➤ మజ్జివలస(GDS BPM)-ఓపెన్
➤ పినగాడి(GDS BPM)-ఎస్టీ
➤ పొట్నూరు(GDS BPM)-ఓపెన్
➤ రాంపురం(GDS BPM)-ఎస్సీ
➤ సుజాతానగర్(DAKSEVAK)-ఓపెన్
కణితి రోడ్డులోని ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో గాజువాక పోలీసులు మంగళవారం తనిఖీలు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ తనిఖీలలో 184 కేజీల గంజాయి, ఒక కారు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇమ్రాన్ ఖాన్, అర్జున్ కుమార్, కోరాడ బాలాజీ కృష్ణ, బిదేశి కుమార్ సాహు, దామా ఖరా, శుక్రమతం, రామచంద్ర సిషా, మనోజ్ ఖేముండు ఉన్నట్లు తెలిపారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన అభ్యర్థులందరి నామ పత్రాలు ఆమోదం పొందాయి. ఎన్నికల అబ్జెర్వర్ నాయక్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం కలెక్టరేట్‌లో పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ప్రమాణాలకు అనుగుణంగా అందరి పత్రాలు ఉండటంతో 10 మంది అభ్యర్థుల తాలూక నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
Sorry, no posts matched your criteria.