India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నికకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈరోజు ఆఖరి రోజు కాగా ఇప్పటివరకు 8మంది నామపత్రాలు సమర్పించారు. సోమవారం ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల పరిశీలన ఈనెల 11న చేస్తారు. 13 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
విశాఖలో పోలీసుల పనితీరు చాలా బాగుందని క్రైమ్ రేట్ పెరగకూడదని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. కమిషనర్ కార్యాలయంలో అధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలు విని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమిషనర్‌తో పాటు డీసీపీలు పాల్గొన్నారు.
విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
ఇటీవల వడ్డాదిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై <<15378554>>పోక్సో కేసు <<>>నమోదు చేసినట్లు బుచ్చయ్యపేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోం మంత్రి అనిత, ప్రజాసంఘాలు స్పందించిన విషయం తెలిసిందే.
అగనంపూడి సమీపంలో రైలు కింద పడి <<15397134>>సూసైడ్ <<>>చేసుకున్న రాదేశ్(38) జేబులో లేఖ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో తన మృతికి ఎవరూ కారణం కాదని, అన్నయ్య పిల్లలు బాగా చదువుకోవాలని.. పైనుంచి మిమ్మల్ని చూస్తుంటానని రాసి ఉంది. కాగా.. ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడిది శ్రీహరిపురం కాగా.. ఫోను ఇంట్లోనే విడచిపెట్టి అగనంపూడి సమీపంలో రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు.
ఓ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన రీల్‌కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక చేసిన రీల్‌కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తనకూ రీల్స్ చేయాలని ఉందని కోఆపరేట్ చేయాలని కోరాడు. ఈ క్రమంలో ఆమెను రెండుసార్లు పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
విశాఖ నుంచి ముంబై వెళ్లే LTT రైలును(18519/20) ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. కాజీపేట్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు వెల్లడించారు. ముంబై నుంచి విశాఖ వచ్చే రైలు కూడా ఫిబ్రవరి 12 నుంచి 22వరకు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
గాజువాక సమీపంలో గల దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో అగనంపూడి రైల్వే ట్రాక్ వద్ద రాదేశ్(38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీహరిపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
భీమిలిలో చదువుతున్న అనకాపల్లి(D) చీడికాడ మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చి KGHలో <<15386000>>ప్రసవించిన సంగతి విదితమే<<>>. నెలలు నిండక ముందే 6 నెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించింది. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి చీడికాడ PSకి బదిలీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు చీడికాడ SI సతీశ్ చెప్పారు. పోక్సో కేసు కావడంతో ఈ కేసును DSP విచారిస్తారన్నారు.
Sorry, no posts matched your criteria.