India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేజీహెచ్‌లో 17 ఏళ్ల బాలిక ప్రసవించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలిక భీమిలిలోని ఓ హాస్టల్‌లో చదువుతోంది. కడుపునొప్పి రావడంతో కేజీహెచ్‌లో చేర్పించగా నెలలు నిండని మగబిడ్డ పుట్టి.. చనిపోయినట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు విచారణ చేస్తున్నారు. ఓ యువకుడు పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరైనట్లు గుర్తించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో భీమిలి డివిజన్ రెవెన్యూ అధికారులతో కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. అన్యాక్రాంతానికి గురైన భూములను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విశాఖ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకట శేషమ్మ అవగాహన నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు సిబ్బంది ఇంటింటికి వెళ్లి అంగవైకల్యం గల చిన్నారులను గుర్తించాలన్నారు. మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉన్న పిల్లలకు వైద్యం అందిస్తే చిన్నతనంలోనే మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంంటుందన్నార. అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో Dy CM పవన్ కళ్యాణ్‌ను తిడుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన భీమిలి మండలం జీరుపేట గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 2న జీరు వీరుబాబు పెట్టిన పోస్టుపై విజయవాడకు చెందిన TDP బూత్ కన్వీనర్ హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసుల సాయంతో గవర్నర్‌పేట పోలీసులు వీరబాబును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం జిల్లా జోనల్ “ఈగల్” వింగ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్‌గా ఎస్.రమేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్, స్మగ్లింగ్ జరిగినా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి డయల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈయన విశాఖ జిల్లాలో 2010 నుంచి 2022 వరకు పలు విభాగలలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ కొరత తీరనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్‌కు పూర్తిస్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అధికారులు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్ ఫర్నెస్ ప్లాంట్ ఉపయోగంలోకి తీసుకురానున్నారు. మొత్తంమీద స్టీల్ ప్లాంట్‌కు కొంత ఊపిరి అందిస్తున్నారు.
గోపాలపట్నంలో లక్కీ షాపింగ్ మాల్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ కాలేజ్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కొత్తపాలెం ఆదర్శనగర్‌కు చెందిన ఉమ్మి వెంకట బాలాజీ(26)గా గుర్తించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం షిప్ యార్డులో అప్రెంటీస్ చేస్తున్నాడు. ఘటనా స్థలానికి ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ అప్పలనాయుడు చేరుకుని విచారణ ప్రారంభించారు.
విదేశాల్లో ఎక్కువ జీతంతో ఉద్యోగాల పేరుతో విశాఖలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. మద్దిలపాలెంలో ఓ కన్సల్టెన్సీ నెలకు రూ.1.50లక్షల జీతం ఇస్తామని నమ్మించి విదేశాలు పంపారు. అక్కడికి వెళ్లాక నియామక పత్రాలు నకిలీవని తేలడంతో గతేడాది జూలైలో పోలీసులు చొరవతో విశాఖ చేరుకున్నారు. సుమారు 10మంది నుంచి రూ.66.98లక్షల వసూలు చేసి నిందితులు పరారైనట్లు బాధితులు ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా నిన్న బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు తెలిపినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు గురువారం ఉదయం 8:15కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాగర్ నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 వరకు విశాఖలోనే ఉండి పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8:40కి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లనున్నట్లు వెంకయ్య నాయుడి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.