India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రజాపద్ధుల కమిటీ సభ్యుడుగా పెనుమత్స విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు. విష్ణుకుమార్ రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శాసనసభలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివిధ కమిటీల సభ్యుల పేర్లను మంగళవారం ప్రకటించారు. ప్రజా పద్దుల కమిటీలో విష్ణుకుమార్ రాజుకు స్థానం లభించింది.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఆనందపురం ఎంఈవోగా పదవీ విరమణ చేసిన ఎస్.ఎస్.పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎటువంటి రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ యూనియన్లతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు ఒక యువతి తప్పిపోయినట్లు మంగళవారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై వెంటనే స్పందించి టెక్ సెల్, సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సదరు యువతిని పీఎం పాలెంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంటల వ్యవధిలో తప్పిపోయిన యువతి ఆచూకీ కనుగొన్న ఎంవీపీ పోలీస్ స్టేషన్ సిబ్బందిని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అభినందించారు.
విశాఖలోని మిథిలాపురిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.
విశాఖలో అర్బన్ పరిధిలో మిగుల భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు జేసీ అశోక్ తెలిపారు. 1.5.2019కి ముందు నుంచి భూమి ఆక్రమణలో ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, GVMC అప్రూవల్ ప్లాన్, ఇంటి పన్ను రసీదు, కరెంటు బిల్ రసీదులతో సంబందిత తహశీల్దార్ కార్యాలయంలో డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు తహశీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
వాల్తేర్ డివిజన్‌కు త్వరలో మూడు వందే భారత్, ఒక అమృత్ భారత్ రైలు రానున్నట్లు వాల్తేర్ DRM మనోజ్ కుమార్ సాహూ తెలిపారు. విశాఖ రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు కొత్త టెండర్లను పిలిచామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వేకు ఈ ఏడాది ఎక్కువ బడ్జెట్ కేటాయించడం హర్షనీయమన్నారు. వేగంగా నడిచే రైళ్ల కోసం లైన్ల ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు.
భీమిలి మండలం కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఉమ్మిడి నరేంద్ర(31) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు నరేంద్ర తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమిలి హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైమ్ అండ్ షిప్పింగ్ విశాఖ పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి ఇవ్వనున్నట్లు కమాండర్ గోపి కృష్ణ సోమవారం తెలిపారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐ.టి.ఐ చదివిన వారు అర్హులన్నారు. వేర్ హౌస్ ఎగ్జిక్యూటివ్, CNC ప్రోగ్రామర్, ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు సింధియా జుంక్షన్ CEMS కేంద్రంలో FEB 10వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
విశాఖలో న్యాక్ ద్వారా నిరుద్యోగులకు ఎలక్ట్రీషియన్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసి 15-45 సం.లోపు వారికి 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టారులో ఉపాధి కల్పిస్తారని చెప్పారు. మహారాణిపేట న్యాక్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ అందిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రంలో పలువురిపై PD యాక్ట్ అమలు చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఆదివారం రాత్రి GO విడుదల చేసింది. వారిలో విశాఖకు చెందిన రావాడ జగదీశ్, రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్ కుమార్, కొలగాన పవన్ రాజ్ కుమార్, నక్కా లోకేశ్, కాండ్రేగుల లోక్ నాథ్ వీర సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఎయిర్ పోర్టు, పీఎం పాలెం, ఆరిలోవ, దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
Sorry, no posts matched your criteria.