Visakhapatnam

News June 4, 2024

విశాఖ దక్షిణలో వంశీకృష్ణకు 61 వేల మెజారిటీ

image

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 17 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు జరిపిన లెక్కింపులో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 92,587 ఓట్లు సాధించగా వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ 31024 ఓట్లు సాధించారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ 61,563 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. వంశీకృష్ణ గెలుపు దాదాపుగా ఖరారైంది.

News June 4, 2024

జగన్‌పై వ్యతిరేకతకు ఇదే నిదర్శనం: గంటా, సీఎం రమేశ్

image

కూటమికి ఏకపక్షంగా వచ్చిన ఎన్నికల ఫలితాల గురించి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్ మంగళవారం సమీక్షించారు. జగన్‌పై ఉన్న కసి, వ్యతిరేకతలు ఫలితాల్లో స్పష్టంగా కనిపించాయని అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News June 4, 2024

విజయం దిశగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేసిన ఎం.శ్రీభరత్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు 2,36,967 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 1,12,893 ఓట్లు సాధించారు. దీంతో శ్రీభరత్ 1,24,074 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. ఆయన విజయం దాదాపుగా ఖరారు అయినట్లే.

News June 4, 2024

వైసీపీ అభ్యర్థి ఓట్ల కంటే.. టీడీపీ అభ్యర్థి మెజారిటీ అధికం

image

విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు వచ్చిన ఓట్ల కంటే టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు వచ్చిన ఆధిక్యత అధికంగా ఉంది. ఏడో రౌండ్ ముగిసే సరికి వెలగపూడికి 47,410 ఓట్లు రాగా.. ఎంవీవీకి 22,821 ఓట్లు లభించాయి. దీంతో వెలగపూడి 24,589 ఓట్ల మెజారిటీతో దూసుకు వెళ్తున్నారు.

News June 4, 2024

విశాఖలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్

image

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధి ఈసీఈ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ల స్ట్రాంగ్ రూమ్ ను నిబంధనల ప్రకారం మంగళవారం ఉదయం 6.30 గంటలకు తెరిచారు. అందులో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు ప్రత్యేక వాహనం ద్వారా ఎస్కార్ట్ సాయంతో ఈసీఈ బ్లాక్‌లో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఇతర అధికారుల సమక్షంలో కలెక్టర్ మల్లికార్జున ఈ ప్రక్రియ నిర్వహించారు.

News June 4, 2024

విశాఖలో టేబుల్స్ వారిగా కౌంటింగ్ సిబ్బంది కేటాయింపు

image

ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ మంగళవారం ఉదయం 5.00 గంటలకు టేబుళ్ల వారీ కౌంటింగ్ సిబ్బందిని కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ పరిశీలకులు అమిత్ శర్మ, ఇతర పరిశీలకుల సమక్షంలో ఏయూ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్వో రూమ్ నుంచి ఆయన మూడో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.

News June 4, 2024

విశాఖ: మూడు వేల మందితో బందోబస్తు

image

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పోలీసులు భారీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. 3000 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. నగరం అంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. 133 సున్నితమైన ప్రాంతాలను గుర్తించామన్నారు. 137 పోలీస్ పికెట్, 79 పెట్రోలింగ్ పార్టీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక క్విక్ రియాక్షన్ టీంలను సిద్ధం చేసినట్లు తెలిపారు.

News June 4, 2024

విశాఖ: వేటకు సన్నద్ధం అవుతున్న మత్స్యకారులు

image

సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ఈ నెల 15 తో ముగియనుంది.ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో అప్పుఘర్,వాసవానిపాలెం, పెద్ద జాలరి పేటలో మత్స్యకారులు వేటకు సన్నద్ధం అవుతున్నారు. చేపల వేటకు అవసరమైన వలలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వేట నిషేధం కారణంగా రెండు నెలలపాటు మత్స్యకారులు ఇంటికే పరిమితం అయ్యారు.

News June 4, 2024

విశాఖ: నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

image

ఎన్నికల కౌంటింగ్ నేపాథ్యంలో ఏయూకి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని భద్రపరిచారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఏయూ కళాశాలలో మంగళవారం చేపడుతున్నారు. వర్సిటీలో స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏయూకు సెలవు ప్రకటించారు.

News June 4, 2024

విశాఖ: 6,7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు

image

బస్ పాస్ దరఖాస్తు మార్పుల కారణంగా ఈ నెల 6, 7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరల తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి యధావిధిగా బస్ పాసు కౌంటర్లు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి బస్ పాసు చేయించుకునే వారు కొత్తగా గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. పాత కార్డులు చెల్లవని ఆయన స్పష్టం చేశారు.