India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఇప్పటికే అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నోటీసులు ఇచ్చారు. అయితే మరో పక్కన స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్‌కు యాజమాన్యం షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

విశాఖలో శనివారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని పోర్ట్ గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, విశాఖ సీపీ శంఖ బ్రాత బాగ్చి కలిశారు. జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు గూర్చి మంత్రి అడిగి తెలుసుకున్నారు. P4 సర్వే సమర్థవంతంగా జరిగేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశాఖ రైల్వే స్టేషన్ లో ఆల్-ఉమెన్ క్రూ స్పెషల్ రైలును శనివారం ప్రారంబించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంస్థ వాల్తేర్ డివిజన్ అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు పూర్తిగా మహిళా సిబ్బందితో ఈ రైలు ప్రయాణం చేస్తుందన్నారు. విశాఖపట్నం స్టేషన్‌లో పలువురు మహిళా స్వచ్ఛ సేవకులను సత్కరించారు.

నగరంలోని ఓ హోటల్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఈమె మేఘాలయ హోటల్లో రూమ్ తీసుకొని ఉరివేసుకొని మృతి చెందగా యాజమాన్యం ఫిర్యాదు మేరకు శనివారం అనుమానాస్పద కేసు నమోదు చేశారు. ఈమె ఎవరు ఎలా మృతి చెందింది అనే విషయం తేలాల్సి ఉంది. రిటన్ సీఐ రమణయ్య ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్టీల్ సిటీ గల్లీ నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్‌కు సెలక్ట్ అయిన మొదటి మహిళగా యర్రాజీ జ్యోతి చరిత్ర సృష్టించారు. విశాఖలో సూర్యనారాయణ, కుమారి దంపతులకు ఆగస్టు 28, 1999న జన్మించిన జ్యోతి, నేడు ఒలింపిక్స్‌లో పోటీ చేసి, దేశం గర్వించేలా ఎదిగారు. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ 12.78 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డు సృష్టించారు. 2024లో అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.

కైలాసగిరి పైకి డబుల్ డెక్కర్ బస్సు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. కైలాసగిరిని శనివారం సందర్శించిన ఆయన గ్లాస్ బ్రిడ్జిని త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. మరిన్ని అడ్వెంచర్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోప్ వే సామర్ధ్య ధ్రువపత్రాలు సమర్పించిన తర్వాతే కేబుల్ కార్ తిరిగేందుకు అనుమతించాలని ఆదేశించారు.

ప్రతీ పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. AU లా కాలేజీ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కృషి ఉంది. 17 ఏళ్లకే పెళ్లైనా భర్త ప్రోత్సాహంతో పై చదువులు అభ్యసించారు. AUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రిన్సిపల్‌గా ఎదిగారు. రాష్ట్రంలోనే ‘పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా’ చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.

కైలాసగిరి రోప్‌వే వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్ ప్రణవ్ గోపాల్ శనివారం ఉదయం సంఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రోప్‌వే నిర్వాహకులకు నోటీసులు అందజేశామని, సమగ్ర దర్యాప్తు అయ్యేవరకు రోప్‌వే సేవలను నిలిపివేయాలని ఆదేశించినట్లు ప్రణవ్ గోపాల్ తెలిపారు.

నేడు మహిళా దినోత్సవం. ప్రపంచమంతా మగువుల విలువ లోకానికి చాటి చెబుతోంది. కానీ తమ కష్టాన్ని గుర్తించే రోజు ఒకటుందని తెలియని శ్రమజీవులు వీళ్లు. శనివారం వేకువజామునే విశాఖలోని సిరిపురం, రైల్వే న్యూకాలనీ, రాంనగర్ ప్రాంతాల్లో ఇలా రోజువారీ పనుల్లో తలమునకలై కనిపించారు. పని మీద ధ్యాస, కుటుంబానికి భరోసా అందించాలనే ఆశ తప్ప విశ్రమించని శ్రామికులు. ఈరోజున శుభాకాంక్షలకు అత్యంత అర్హత కలిగిన మహిళామణులు వీళ్లు.

అప్పు ఇచ్చిన వారి ఇంటిలోనే చచ్చిపోతున్నా.. అంటూ ఓ మహిళ వాయిస్ మెసేజ్ కలకలం సృష్టించింది. కొబ్బరి తోటకు చెందిన ధనలక్ష్మి వద్ద సుగుణ అప్పు తీసుకుంది. వీరిద్దరి మధ్య వివాదం జరగ్గా ధనలక్ష్మి, ఆమె కుమారుడు సుగుణతో గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన సుగుణ.. గురువారం ధనలక్ష్మి ఇంటికి వెళ్లి రూమ్‌లో తలుపు వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సుగుణ బంధువులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
Sorry, no posts matched your criteria.