India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్లూరి జిల్లాలో ఆరు రోజుల బాలింత మృతి చెందింది. ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. డుంబ్రిగుడ మండలం గంగుడుకి చెందిన సొయిత శుక్రవారం అరకులోయ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చింది. బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురైంది. అరగంట తర్వాత సిబ్బంది వచ్చి సీపీఆర్ చేయగా, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి మృతి చెందింది. దీంతో ఆసుపత్రి బయట ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు. కవలలు ఆరోగ్యంతో ఉన్నారు.
విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతికి ప్రత్యేక బస్సు సర్వీసును నడపడానికి ఏపీ పర్యాటక సంస్థ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో ఈ బస్సు బయలుదేరుతుంది. 11 ఉదయాన్నే తిరుపతి చేరుకుంటుంది. ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్తారు. తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శనం అనంతరం విశాఖకు బయలుదేరుతుంది. పెద్దలకు రూ.6,300, పిల్లలకు రూ.6,000 చెల్లించాలి.
చక్రధర్ పూర్ డివిజన్‌లో ముంబయి (12810) ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. దీంతో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు ప్రకటించారు. రైళ్లతో పాటు, ఇతర సమాచారం ప్రయాణికులకు చేరవేసేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమాచారం కోసం 0801-2746330, 0891-2744619 సంప్రదించాలన్నారు.
విశాఖ కేంద్రంగా గల తూర్పు నావికాదళం ఐఎన్‌ఎస్ డేగాలో పదవి విరమణ పొందిన 63 మంది నావికులు వారి కుటుంబాలకు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలుకుతూ అభినందన సభ ఏర్పాటు చేశారు. పదవి విరమణ పొందిన నావికులు సేవలను పలువురు ప్రసంశించారు. ధైర్యం, సాహసాలను ప్రదర్శిస్తూ విధులు నిర్వర్తించిన వీరిని ఆదర్శంగా తీసుకోవాలని అధికారులు సూచించారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం విశాఖ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు జనార్ధన్ అధ్యక్షుడు, అధ్యక్షుడు రవికాంత్ పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేస్తే చర్యలు తప్పవని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు హెచ్చరించారు. ప్రైవేట్ వైద్యులు, స్కానింగ్ సెంటర్ల యజమానులకు లింగ నిర్ధారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ జిల్లా సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ చేస్తే మొదటి తప్పుగా రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
భీమిలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల పట్టణానికి చెందిన యువకుడు మృతి చెందాడు. చింతలవలస ఎంవీజీఆర్‌లో బీటెక్ చదువుతున్న సాయి గణేష్, తన స్నేహితుడితో కలిసి భీమిలి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో భీమిలి వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో సాయి గణేశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెనుక కూర్చున్న మరో యువకుడికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. మంగళవారం విశాఖలో కార్మికుల సమస్యలపై ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, పీఎఫ్, పీఎస్ఐ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ కార్మిక సంఘాల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. త్వరలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.
నక్కపల్లి మండలం APIIC నిర్వాసితుల సమస్యలపై విశాఖ సర్క్యూట్ హౌస్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఏడు గ్రామాల రైతులు, ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. త్వరలోనే ఏపిఐఐసీ నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కారం అవ్వాలని మంత్రి కలెక్టర్ విజయకృష్ణన్, అధికారులను ఆదేశించారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో మిగిలిన హుండీలను మంగళవారం లెక్కించారు. 29, 30 తేదీల్లో మొత్తం రూ.2,65,72,189 నగదు లభించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. రెండు రోజుల లెక్కింపులో బంగారం 186 గ్రాముల 950 మిల్లీగ్రాములు, వెండి 13 కిలోల 500 గ్రాములు లభించినట్లు తెలిపారు. అలాగే వివిధ దేశాల కరెన్సీని భక్తులు కానుకలుగా వేసినట్లు పేర్కొన్నారు
Sorry, no posts matched your criteria.