India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలకు 20 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. ఆగస్టు మూడవ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవుతుందన్నారు. వచ్చే నెల 7వ తేదీన ఎన్నికలు నిర్వహించి.. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు.
మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 2వ జోన్ పరిధిలో 6,7,8 వార్డుల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్.రవి మంగళవారం తెలిపారు. రెండవ జోన్ పరిధిలో గోస్తని నది జలాలకు బోని గ్రామం వద్ద ఉన్న గోస్తని హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 700MM డీఐ పైపులైను లీకులు ఏర్పడ్డాయన్నారు. వాటి మరమ్మతుల కారణంగా బుధవారం తాగునీరు సరఫరా ఉండదన్నారు.
చట్టబద్ధమైన దత్తతను మాత్రమే ప్రోత్సాహించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కే.అప్పారావు సూచించారు. ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, కేజీహెచ్ సంయుక్తంగా మంగళవారం కేజీహెచ్ ఎథిక్స్ గ్యాలరీలో అనాధికార దత్తత-చట్టప్రకారం చర్యలు అనే అంశంపై గైనకాలజీ పిల్లల విభాగం వైద్యులు, నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యుడు గొండు సీతారాం పాల్గొన్నారు.
సగటు మనుషి జీవన చిత్రమే రావిశాస్త్రి రచన సారాంశం అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం బీచ్ రోడ్ లోని రావిశాస్త్రి మెమోరియల్ దగ్గర జరిగిన రావిశాస్త్రి 102వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి సీనియర్ న్యాయవాది ఎం.రామదాసు హాజరై రావిశాస్త్రి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, సాధారణ బడుగు బలహీన వర్గాల ఆశాదీపంగా ఎన్నో రచనలు చేశారన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖ నుంచి రాష్ట్రంలోని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. మహిళల, బాలికల రక్షణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నేర నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉంటే వాటిపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని ఉప రవాణా కమిషనర్ జీసీ.రాజారత్నం తెలిపారు. వాహనాలలో బ్లాక్ ఫిలిం వెంటనే తొలగించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఎన్‌ఎస్‌టిఎల్, బోయపాలెం, పీఎంపాలెం తదితర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేసి బ్లాక్ ఫిలిం కలిగిన 23 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆర్టీసీలో విజయనగరం జోన్ పరిధిలో అప్రెంటిషిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆగస్టు ఒకటి నుంచి 16 తేదీ వరకు తమ పేర్లను www.apprenticeshipindia.gov.in సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లా పరిధిలో వివిధ ట్రేడ్‌లలో ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
సుమారు వారం రోజుల తర్వాత చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల ప్రవేశాలను పునరుద్ధరిచారు. అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో, చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రవేశాలను నిలుపుదల చేశారు. వర్షాలు తగ్గడంతో జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతిస్తున్నారు.
విశాఖలో ఏపీ ప్రభుత్వం 76.90 కి.మీ. లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనను ఈ ఏడాది జనవరిలో చేసిందని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజ్యసభలో తెలిపారు. ప్రాథమిక పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ మదింపు నిమిత్తం ముందస్తు అవసరమైన కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, 2018ను అప్డేట్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
అండర్-16 మల్టీ డే అంతర్ జిల్లాల ఫైనల్‌లో విశాఖ జట్టు 433 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెల్లూరులో మూడు రోజులపాటు జరిగిన ఫైనల్ పోరులో కృష్ణా జట్టుపై టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 456 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జిల్లా జట్టు 148 పరుగులకే ఆల్ అవుట్ అయింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విశాఖ 194/4 చేయగా కృష్ణా 69 రన్స్‌కి ఆల్ అవుట్ అయ్యింది.
Sorry, no posts matched your criteria.