India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ రానున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరంలో గల టీడీపీ కార్యాలయానికి వెళ్తారు . అక్కడ ముఖ్య నాయకులతో మాట్లాడుతారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం జిల్లా కోర్ట్‌కు హాజరు అవుతారు. అనంతరం విజయవాడ తిరిగి పయణమవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
విశాఖలో IASగా చలామణి అవుతున్న వంగవేటి భాగ్యరేఖ@అమృత, మన్నెందొర చంద్రశేఖర్ జంటపై MVP పోలీసులు కేసు నమోదు చేసి శనివారం అరెస్ట్ చేసారు. న్యాయ స్థానంలో వారిని హాజరుపరచగా ఇద్దరికీ 15రోజులు రిమాండ్ విధించారు. అనేక మంది అమాయకులకు ఉద్యోగాలు కల్పిస్తామని, TIDCO ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు అడుగుతుంటే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు బాధితులు తెలిపారు.
జీవీఎంసీ పరిధిలో ఇప్పటివరకు 1200 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆర్.సోమన్నారాయణ తెలిపారు. జనవరి ఒకటి నుంచి జీవీఎంసీ సిబ్బంది పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిందని వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు.
గాజువాక సమీపంలోని పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పేకాట శిబిరంపై శనివారం దాడి చేశారు. వుడా కాలనీలో పేకాట ఆడుతుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1,11,430 నగదుతో పాటు 7 మొబైల్స్ సీజ్ చేశారు. వీరిని న్యూ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తగరపువలస ఆదర్శనగర్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత శనివారం మాధవి (25)ఇద్దరు కుమార్తెలతో పాటు పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తల్లితో పాటు చిన్న కుమార్తె రతిక్ష మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగంమని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
విజయసాయి రాజీనామా చేసి బయటకు వెళ్లినా చట్టం నుంచి తప్పించుకోలేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన తన నివాసాల విలేకరులతో మాట్లాడారు. విజయసాయి హయాంలో విశాఖ వాసులు పడిన ఇబ్బందులను మర్చిపోలేమన్నారు. వైసీపీ మునిగిపోయే నావని తాను ఎప్పుడో చెప్పానని వ్యాఖ్యని గుర్తుచేస్తూ ఇప్పుడు అది నిజమవుతోందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై ఇప్పటికీ వక్రంగా మాట్లాడుతున్నారన్నారు.
భీమిలిలో ఫొక్సో కేసు నమోదైనట్లు సమాచారం. గాజువాకకు చెందిన వ్యక్తి భీమిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ఆ వీడియోతో బాలిక తల్లిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖలో శనివారం జరిగే ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వాహకులు తెలిపారు.➣ఉదయం 7.30కి సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్, సైబర్ సెక్యూరిటీ అంశంపై బీచ్ రోడ్డు, తెలుగు తల్లి విగ్రహం నుంచి వాకథాన్➣ఉదయం 10గంటలకు TDP కార్యాలయంలో హోంమంత్రి అనిత ప్రెస్ మీట్➣ఉదయం 10 గంటలకు KGHలో వెల్నెస్ సెంటర్ ప్రారంభం➣ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రెస్ మీట్➣మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి అంశంపై CPM సదస్సు
కార్డేలియా క్రూజ్ షిప్ విశాఖ పోర్టుకు రానుంది. పోర్టు యాజమాన్యం కృషి ఫలితంగా ఈ షిప్ పుదుచ్చేరి, చెన్నై- విశాఖల మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు 3 సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. జీఏసీ షిప్పింగ్ (ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ఈ షిప్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోర్ట్ కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.
Sorry, no posts matched your criteria.