India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖలో రుషికొండ బీచ్‌లో పర్యాటక స్పీడ్ ఓట్లను శనివారం నుంచి పునరుద్ధరించారు. తుఫాన్ ప్రభావం కారణంగా భారీ ఈదురు గాలులు వీచిన కారణంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం టూరిజం స్పీడ్ బోట్లను ఈ నెల 18వ తేదీ నుంచి నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో యథావిధిగా వీటిని నడుపుతున్నట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
భారత తూర్పు తీరంలో చేపట్టిన మిషన్ గస్తీ విజయవంతంగా ముగిసినట్లు కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ తెలిపారు. శనివారం విశాఖలో ఈ.ఎన్.సీ ముఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మిషన్ గస్తీలో ఐఎన్ఎస్ కరంజ్ జలాంతర్గాలు అధికారులు, సిబ్బంది అద్భుత ప్రదర్శన కనపర్చినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల ఆపరేషన్ లక్ష్యాలను చేరుకోవడం అభినందనీయం అన్నారు.
ఆనందపురం మండలం దుక్కవానిపాలెం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో దివీస్ ఉద్యోగి ఉప్పల రాధాకృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది బాపట్ల జిల్లా వేమూరు మండలం బుతమల్లి గ్రామం. 2002 నుంచి దివీస్ కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. గాజువాక స్టీల్ లోడ్ తీసుకొని వెళ్లివస్తూ టోల్ ప్లాజా వద్ద మంచినీటి కోసం ఆగి రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొని మరణించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ నగరంలోని అత్యంత విలువైన దసపల్లా భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. భూములు ప్రభుత్వానివి అని మరోసారి రుజువైనందున తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ భూముల హక్కుదారులుగా ఇంతవరకు చలామణి అయిన రాణి కమలాదేవికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
గోదావరి, శబరి వరదల నేపథ్యంలో వరద బాధితులు ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ఎటువంటి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. అవసరమైన వారిని గుర్తించి రేషన్, నిత్యావసర వస్తువులు, టార్పాలిన్లు, దోమతెరలు, కిరోసిన్ టార్చ్ లైట్ లు లాంటివి పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
చోడవరానికి చెందిన బాలుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, బుక్ ఆఫ్ ఇండియా రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అలవల సత్యప్రసాద్, మానస దంపతుల కుమారుడు ఆష్మాన్ రామ్ రెండున్నరేళ్ల వయసులో 110 దేశాల జాతీయ జెండాలను గుర్తించి వాటి దేశాల పేర్లు చెప్పడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు. ఆన్లైన్లో లింగాష్టకం 57 సెకెన్లలో ఆలపించడంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాడు.
భారీ వర్షానికి ట్రాక్ పై బండరాళ్లు పడవచ్చుననే కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ – కిరండూల్ నైట్ ట్రైన్(18514) ఈ నెల 27 నుంచి 31 వరకు విజయనగరం, రాయగడ మీదుగా కిరండూల్ చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణం కిరండూల్-విశాఖ నైట్ ఎక్స్ ప్రెస్(18513) ఈ నెల 28 నుంచి ఆగష్టు 1వ తేదీ వరకు కిరండూల్ నుంచి రాయగడ, విజయనగరం మీదుగా విశాఖ చేరుతుందన్నారు.
ఈ నెలలో ఉత్తమ సేవలు అందించిన పోలీస్ కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు 81 మందికి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ రివార్డులు అందించారు. నగరంలో శనివారం నెలవారీ క్రైమ్ రెవ్యూ నిర్వహించారు. గంజాయి రవాణా, చోరీ సొత్తు రికవరీ తదితర సంఘటనలలో ప్రతిభ కనపర్చిన వారికి ప్రతి నెలా రివార్డులు అందజేసి వారిని ప్రోత్సహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో పరిచయం చేసుకొని అమ్మాయిల ఫొటోలు ఎరగా చూపి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ వాసి కె.లోకేశ్‌ను అరెస్టు చేసినట్లు విశాఖ సైబర్ క్రైమ్ సీఐ భవాని ప్రసాద్ తెలిపారు. ఆ వ్యక్తి మాయలో నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ. 28 లక్షలు పోగొట్టుకున్నాడని ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పట్టుకున్నామన్నారు. కేసులో సంబంధం ఉన్న మరి కొంతమంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.
పూండి-నౌపడ సెక్షన్లో పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆగస్టు 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(12830) గంట ఆలస్యంగా మ.1.10 గంటలకు, ఆగస్టు 3న పూరీ-గాంధీధాం (22974) గంటన్నర ఆలస్యంగా మ.12.45 గంటకు, భువనేశ్వర్-తిరుపతి (22879) గంట ఆలస్యంగా మ.1.10 గంటకు బయలుదేరుతుంది. ఈ నెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో విశాఖ-పలాస-విశాఖ మాత్రమే రాకపోకలు సాగిస్తుంది.
Sorry, no posts matched your criteria.