India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖలో ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
వాల్తేరు తాత్కాలిక డీఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా గతంలో డీఆర్ఎంగా పనిచేసిన సౌరభ్ ప్రసాద్‌ను సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఓ టెండర్ విషయమై అవినీతికి పాల్పడుతూ సీబీఐ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రైల్వే నూతన డిఆర్ఎంగా మనోజ్ కుమార్ సాహును ప్రభుత్వం నియమించింది.
మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ హాల్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. పెద్ద ఎత్తున హోటళ్లు తీసుకొస్తామన్నారు. టాప్ 100 ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 25వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో ప్రకటించారు. గంజాయిపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడడం విచారించదగ్గ విషయంగా పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నారు.
రాష్ట్రంలో గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు హోం మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. దీని నియంత్రణకు టాస్క్ ఫోర్స్ తో పాటు యాంటీ నార్కోటిక్ బృందాన్ని ఏర్పాటు చేసి దానికి అడిషనల్ డీజీపీ ర్యాంక్ అధికారిని నియమించినందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఓ కంపెనీకి అలిపిరిలో కేటాయించిన 38 ఎకరాల భూమిని ఇవ్వాలని ఆ యజమాన్యంపై గత ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో వెల్లడించారు. ఆ యాజమాన్యంతో 25 సార్లు మీటింగ్ పెట్టి మాజీ సీఎం జగన్ బెదిరించినట్లు ఆరోపించారు. ఆ భూమి ఇవ్వకపోతే షూట్ చేస్తామని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
గూడెం కొత్తవీధి మండలంలోని సీలేరులో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నాయని తహశీల్దార్ టీ.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి సీలేరు డ్యామ్ పరిసరాలను పరిశీలించారు. డ్యాంలో సీ ప్లైన్‌కు సంబంధించిన జెట్టి నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలించారు. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా విశాఖ నుంచి కానీ రాజమండ్రి నుంచి బలిమెల వరకు సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
విశాఖతో పాటు విజయనగరం విజ్జీ స్టేడియంలో ఈనెల 23 నుంచి సయ్యద్ ముక్తర్ అలీ క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అస్సాం, ఒడిశా, పాండిచ్చేరి, చత్తీస్‌గఢ్, విదర్భ, రైల్వేస్ జట్లు పోటీ పడనున్నాయని అన్నారు. ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లలో పాల్గొంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
విశాఖలో లా విద్యార్థిని పై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ పేరుతో వలవేసి బాధితురాలికి చేరువై.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతోపాటు అతడి స్నేహితులు జగదీశ్, ఆనంద్, రాజేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితులకు వచ్చే నెల 2వరకు రిమాండ్ విధించింది.
వచ్చేనెల ఏడవ తేదీన నిర్వహించే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా పరిష్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్టిక్కర్స్, కారు ఫ్లాగ్స్, పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా డిసెంబర్ 7న సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని నిర్వహించి దేశ రక్షణ కోసం సాయుధ దళాలు చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటామన్నారు.
Sorry, no posts matched your criteria.