India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కశింకోట మండలం <<13690589>>విసన్నపేట<<>>లో వైశాఖీ వ్యాలీ పేరు మీద వేసిన లేఅవుట్‌లో ప్లాట్ల విక్రయాలు నిలిపివేయాలని వీఎంఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో తగిన సమాధానం ఇవ్వాలని లేఅవుట్ సంస్థ వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్స్‌ను ఆదేశించింది. ఈ లేఅవుట్‌లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్రమాలకు పాల్పడ్డారని జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వీఎంఆర్డీఏ కమిషనర్‌కు ఇటీవల ఫిర్యాదు చేశారు.
నరవ ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ జరగనున్నట్లు ప్రిన్సిపల్ కె.ఎస్. శ్రీనివాసరావు తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీకి అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తుల చేసుకున్న గడువు బుధవారంతో ముగిసిందన్నారు. ఎలక్ట్రిషియన్, ఫిట్టరు, ఎలక్ట్రానిక్, మెకానిక్, డీజిల్ మెకానిక్ ట్రేడులలో సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా కౌన్సెలింగ్ రోజున అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.
ఎల్టీటీ-విశాఖ(18520) ఎక్స్ ప్రెస్ ఈ నెల 29 నుంచి ఆగస్టు 1 వరకు వయా పుణె-మిరాజ్-కుర్దువాడి స్టేషన్ల మీదుగా నడుస్తుందని వాల్తేరు సీనియర్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈ నెల 30న భువనేశ్వర్-పుణె (22882) ఎక్స్ ప్రెస్ సోలాపూర్ వరకు నడుస్తుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 1న పుణె- భువనేశ్వర్(22881) ఎక్స్ ప్రెస్ పుణె బదులు సోలాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నారు.
అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి వివాహం చేసుకుంటారా అని నమ్మించి మోసం చేస్తున్న బి.సాయిప్రియ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన ఓ అవివాహితుడుకి మ్యాట్రిమోనీలో రిక్వెస్ట్ పెట్టి రూ.22 లక్షలు తన ఖాతాలో వేయించుకుంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లో ఆ మహిళను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
వాటర్ మెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ నేడు ఎర్ర మట్టి దిబ్బలు, మడసర్లోవ, చిల్లపేట చెరువు, లాసన్స్ బే వద్ద సముద్రంలో కలుస్తున్న మురుగునీటి పరిశీలనకు వస్తున్నారు. ఉదయం 10 గంటలకు ముడసర్లోవ డంప్ యార్డ్, 11 గంటలకు చిల్లపేట చెరువు (భీమిలి), మధ్యాహ్నం 12.30 గంటలకు ఎర్ర మట్టి దిబ్బలు, మధ్యాహ్నం 2 గంటలకు లాసన్స్ బే బీచ్ పాయింట్ పరిశీలిస్తారు.
అనకాపల్లిలో ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం తనిఖీ చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఇతర పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భద్రతా పరమైన చర్యలపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం లాక్ బుక్కులో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ వై. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గుముఖం పట్టనందున, ఈనెల 25వ తేదీన కూడా అన్ని యాజమాన్య పాఠశాలలకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు సెలవు అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు బయటకు పంపించకూడదని, ప్రజలు గెడ్డలు, వాగులు దాటి ప్రయాణించకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
బుధవారం జరిగిన ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. మన రాష్ట్రంలో ఇది చాలా పెద్ద స్కాం అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం లిక్కర్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని తెలిపారు. తయారీ కంపెనీలు అన్నీంటినీ వైఎస్.జగన్ బినామీలే నడిపారన్నారు. దీనిపై సీబీ సీఐడీ, సీబీఐలతో విచారణ చేయించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
విశాఖ నగరానికి చెందిన ఎర్రాజీ జ్యోతి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పారిస్‌లో రేపటి నుంచి జరిగే ఒలింపిక్ క్రీడల్లో ఆమె పాల్గొననుంది. 100 మీటర్ల హార్డిల్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఒలింపిక్స్‌కు విశాఖ అమ్మాయి అర్హత సాధించడం పట్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్న నవ్వులు పూయించారు. రోడ్ల సమస్యపై ప్రశ్నించేందుకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌కు స్పీకర్ అయ్యన్న అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ పెద్దలకు, మంత్రులకు, నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెపుతుండగా.. స్పీకర్ అయ్యన్న కలగజేసుకొని రోడ్ల గురించి మాట్లాడాలని సూచించారు. దీంతో ముందు వరుసులో కూర్చున్న పవన్ కళ్యాణ్‌తోపాటు సభ్యులు ఒక్కసారిగా నవ్వారు.
Sorry, no posts matched your criteria.