India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎండాడ సాయిరాం పనోరమ హిల్స్ వద్ద నూతనంగా నిర్మాణంలో ఉన్న భవంతులలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అనారోగ్యంగా ఉండి మద్యం తాగి మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్‌లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.
మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన ఆర్మీ జవాన్ గూనూరు భరత్(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేసేవాడు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమించిన యువతి దూరమవుతుందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామం తీసుకువచ్చారు.
వైసీపీ అధినేత జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను, పరిశీలకులను మారుస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను)ని నియమించారు. మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు శాసనసభ స్థానాలకు పరిశీలకులను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. గాజువాక సమన్వయకర్తగా దేవం రెడ్డి, భీమిలి సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు, అనకాపల్లి పరిశీలకులుగా కరణం ధర్మశ్రీ, చోడవరం సమన్వయకర్తగా అమర్నాథ్, మాడుగుల సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడును అధిష్టానం నియమించింది.
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ స్టీల్ ప్లాంట్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి శనివారం పాలాభిషేకం చేశారు. ముందుగా స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించిన అమృతరావు విగ్రహానికి జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శనివారం విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. ఈరోజు సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా రేపు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 2nd AC, 3rd AC, స్లీపర్, జనరల్ ఉంటాయాన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లాప్‌టాప్, రెండు మొబైల్స్, 80 బ్యాంకు అకౌంటులను స్వాధీనం చేసుకొని వాటిలో రూ.140కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లావాదేవీలకు సహకరించిన నలుగురుని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.
స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, గార్బేజ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సూచించారు.
భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న <<15172608>>ముస్తఫా<<>> ఈనెల15న ఉదయం కాకరకాయ జ్యూస్ అని భావించి పురుగుమందు తాగడంతో మృతి చెందాడు. తనకు షుగర్ వ్యాధి ఉండడంతో రోజు కాకరకాయ జ్యూస్ తాగుతాడు.14న మొక్కలకి పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్‌లో ఉంచాడు. ఆ విషయం మర్చిపోయి పురుగుల మందు తాగాడు. భార్య ఫాతిమా పురుగుల మందు ఏదని ప్రశ్నించడంతో తాగింది పురుగుమందు అని తెలిసింది.
Sorry, no posts matched your criteria.