Visakhapatnam

News May 22, 2024

సింహాచలం: నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు

image

సింహాచలం ఆలయంలో బుధవారం, గురువారం ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు సింహాచలం దేవస్థానం ఏఈఓ ఆనంద్ కుమార్ మంగళవారం తెలిపారు. ఈనెల 22న శ్రీ నృసింహ జయంతి, స్వాతి నక్షత్ర హోమం నిర్వహిస్తున్న కారణంగా ఆర్జిత సేవలు అన్నింటిని రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 23న వైశాఖ పౌర్ణమి కావడంతో గురువారం కూడా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 22, 2024

భీమిలి: రిటైర్డ్ కానిస్టేబుల్ మృతి

image

భీమిలి నియోజకవర్గం తగరపువలస-ఆనందపురం సర్వీసు రోడ్డులో వలందపేట దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాళ్లవలస రాజేశ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రిటైర్డ్ కానిస్టేబుల్ దండు వెంకటపతిరాజు(64) పూజ సామగ్రి కోసం సంగివలసకు బైకుపై వచ్చారు. తిరిగి వెళ్తుండగా కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో ఆయన మృతిచెందారు. రాజు కుమారుడు లండన్‌లో చదువుతుండగా సంగివలసలో కుమార్తె సాయిలక్ష్మి దగ్గర ఆయన ఉంటున్నారు.

News May 22, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా మే
27 నుంచి జూన్ 23 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు-రాయగడ(17243), తిరుపతి-విశాఖపట్నం(22708)
డబుల్ డెక్కర్లను మే 27 నుంచి జూన్ 22 వరకు రద్దు చేశారు. రాజమండ్రి-విశాఖపట్నం(07466), విశాఖపట్నం-రాజమండ్రి (07467) మెమో ప్యాసింజర్లను మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు.

News May 21, 2024

వైసీపీకి కాలం చెల్లింది: RRR

image

రాష్ట్రంలో వైసీపీకి కాలం చెల్లిందని ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణ రాజు(RRR) అన్నారు. విశాఖ నగరంలోని సీతమ్మధారలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ను వ్యతిరేకించిన మొదటి వ్యక్తి తానేనని చెప్పారు. ఆ ఒక్క కారణంతోనే తనను జైల్లో పెట్టించి ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

News May 21, 2024

విశాఖ: ఈవీఎంల స్ట్రాంగ్ రూముల తనిఖీ

image

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. పార్లమెంటు నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్‌తో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పోలీసు జాయింట్ కమిషనర్ ఫక్కీరప్పతో కలిసి తనిఖీ చేశారు. ప్రతి గదికి వేసిన తాళాలు, సీళ్లను పరిశీలించారు.

News May 21, 2024

విశాఖ: యువకుడి స్పాట్‌డెడ్

image

ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం హైవే వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక జంక్షన్ వద్ద ఓ ప్రైవేటు బస్సు టర్నింగ్ తిప్పుతుండగా.. తుని నుంచి వైజాగ్ వైపు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వినయ్ అనే యువకుడు చనిపోగా.. దుర్గేశ్ గాయపడ్డాడు. మృతుడి స్వగ్రామం, తదితర వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

అనకాపల్లి: 10 ద్విచక్ర వాహనాలు.. మూడు ఆటోలు సీజ్

image

అనకాపల్లి పట్టణ శివారు ప్రాంతాలైన సుబ్రమణ్యం కాలనీ, డీబీ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

News May 21, 2024

తెలంగాణ ఈ సెట్‌లో పరవాడ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

image

పరవాడలో నివాసముంటున్న ఖ్యాతేశ్వర్ తెలంగాణ ఈ సెట్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 2023లో కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో 80% మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదివి ఈ లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాలెం గ్రామానికి చెందిన ఖ్యాతేశ్వర్ తండ్రి విన్నారావు ఉద్యోగం నిమిత్తం పరవాడలో ఉంటున్నారు.

News May 21, 2024

పెందుర్తి: 24న ఎంఎస్ఎంఈ వర్క్‌షాప్

image

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ నెల 24న ఎంఎస్ఎంఈ మేక్‌ఇన్ ఇండియా సపోర్ట్ స్టార్టప్ అండ్ అగ్రిటెక్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈ చాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డాక్టర్ దాసరి దేవ రాజ్, డీజీఎస్ సంతోష్ కుమార్‌లు ఈ విషయం తెలిపారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం టీటీడీసీలో వర్క్‌షాప్ జరుగుతుందని తెలిపారు.

News May 21, 2024

విశాఖ: సామాన్యులకు అందని మామిడి పండ్లు

image

మామిడి పండ్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విశాఖ నగరంలో కిలో మామిడి పండ్లను రూ.150- రూ.200కు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు వాటి దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు.