India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ జూపార్క్‌లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మార్చి 2వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జూ పార్కు బయోస్కోఫ్ వద్ద పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. 1వ క్లాస్ నుంచి పీజీ వరకు విద్యార్థులు పోటీలలో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు జూ కార్యాలయాన్ని సంప్రదించాలని, జీవవైవిద్య పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.

శివరాత్రి జాగరణ అనంతరం విశాఖ నగరవాసులు గురువారం సముద్రంలో పుణ్యస్నానాలు చేశారు. వీరి కోసం అటు అధికారులు ఇటు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బలగాలను మోహరించినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. అలాగే జన సందోహంలో చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను ఉపయోగించారు.

విశాఖలో గురువారం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగాయి. జిల్లాలోని 13 కేంద్రాల్లో 87.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎన్నికల విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు.

విశాఖలోని డాబా గార్డెన్ వద్ద గల నీలమ్మ వేప చెట్టు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు మెడికల్ స్టోర్ వద్దకు వచ్చి మందులు తీసుకునే సమయంలో కుప్పకూలి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీశారు. అతని వద్ద కేవలం మందుల చీటీ తప్ప మరే ఆధారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో శిశువుల మార్పిడి ఘటన కలకలం రేపింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శివానంద్ దీనిపై స్పందించారు. ఈ మార్పిడి ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఏడుగురు అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే సీసీ ఫుటేజీ ఆధారంగా అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.

కంచరపాలెం సమీపంలోని కేవీ స్కూల్లో 9వ తరగతిచదువుతున్న దాసరి ఎర్రినిబాబు తన ఇంట్లో మేడపై బాత్రూంలో నైలాన్ తాడుతూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ సెలవు కావడంతో ఉదయం నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లి ఎర్రినిబాబును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు సాయంత్రం మేడ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖ ఆర్కే బీచ్‌లో మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ హైందవ ధర్మంను కాపాడుకోవడాన్ని తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్‌ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.

➤ విశాఖ జిల్లా వ్యాప్తంగా మార్మోగిన శివనామస్మరణ
➤ రేపు 13 కేంద్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
➤ జిల్లా వ్యాప్తంగా రేపు అన్ని పాఠశాలలకు సెలవు
➤ త్వరలో విశాఖ మెట్రో పనులు ప్రారంభం?
➤ మల్కాపురానికి చెందిన 22 ఏళ్ల యువకుడు మృతి
➤ ఆర్.కే, అప్పికొండ, భీమిలి బీచ్‌లలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు చేసిన అధికారులు

విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తెల్లటైగర్ ఎన్ క్లోజర్, జిరాఫీ ఎన్ క్లోజర్, బటర్ ఫ్లై పార్కుతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్లో వీటిని ఏర్పాట చేశారు. కలర్ ఫుల్‌గా వివిధ హంగులతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద సందర్శకులు, చిన్నపిల్లలు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. పాయింట్లు మరిన్ని పెంచాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.