Visakhapatnam

News January 7, 2025

ప్రధాని సభా ప్రాంతం పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్

image

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విశాఖ ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. రోడ్డు, ప్రధాని సభ, గ్యాలరీ, బారికేడ్లు, పనులను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి ప్రధానిని చూడటానికి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను మరింత బాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2025

ప్రధానమంత్రి రోడ్ షోకు ప్రచార రథం సిద్ధం..!

image

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోకు ప్రచార రథాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి ఏయూ మైదానం వరకు ప్రధాని ఈ రథంపై రోడ్‌ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా మోదీ బొమ్మ మధ్యన ఉంటూ ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది

News January 7, 2025

పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు: హోం మంత్రి అనిత

image

పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మంగళవారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏయూలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రధాని పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.

News January 7, 2025

విశాఖలో ప్రధాని సభ.. వారికి పులిహోర, వెజ్ బిర్యానీ 

image

విశాఖలో ప్రధాని మోదీ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి అధికారులు ప్రత్యేక మెనూ తయారు చేశారు. సభకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టు మధ్యాహ్నం పులిహోర, రాత్రికి వెజ్ బిర్యానీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్స్ కూడా సిద్ధం చేస్తున్నారు.

News January 7, 2025

హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆందోళన వద్దు: విమ్స్ డైరెక్టర్

image

దేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విమ్స్ డైరెక్టర్ డా.రాంబాబు సూచించారు. సోమవారం విమ్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారికి ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనిపై అనుమానాలు, భయాందోళనలు వద్దన్నారు.

News January 7, 2025

పాత గాజువాక జంక్షన్‌లో ఫార్మా ఉద్యోగి మృతి

image

పాత గాజువాక జంక్షన్‌లో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వాహనం ఇద్దరు ఫార్మా ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కిరెడ్డిపాలెంకు చెందిన రమేశ్ మరణించాడు. గాయపడిన మరో ఉద్యోగిని ఆసుపత్రిలో చేర్పించారు. గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 7, 2025

విశాఖ: నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

image

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను మంగళ, బుధవారాల్లో చేపట్టనున్నట్లు APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుందన్నారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సూచనలు అభ్యంతరాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వీకరిస్తారని అన్నారు.

News January 7, 2025

విశాఖలో 35 మంది IPSలు.. 4వేల మంది పోలీసులు 

image

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు 4వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. పర్యవేక్షణకు 35 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కొందరు పోలీసులు నగరానికి చేరుకోగా మంగళవారం మిగిలినవారు వస్తారని వెల్లడించారు.

News January 7, 2025

విశాఖ: గాలిపటం ఎగరవేస్తూ వ్యక్తి మృతి

image

విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే న్యూ కాలనీ బలరాం అపార్ట్మెంట్ మేడపై నుంచి సోమవారం ఓ వ్యక్తి జారిపడి మృతి చెందాడు. దల్లి డేవిడ్ (38) పిల్లల కోసం గాలిపటం కొనుగోలు చేశాడు. దానిని మేడ పైకి వెళ్లి ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన డేవిడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య అనూష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 7, 2025

25 వేల మందికి ఉపాధి అవకాశాలు: మంత్రి

image

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న అచ్యుతాపురం మండలం పూడిమడకలో రూ.85 వేల కోట్లతో శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాత్రి విశాఖలోని సీతంపేట జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధానికి జనసేన తరఫున ఘనంగా స్వాగతం పలకడానికి కార్యాచరణ రూపొందించామన్నారు.